ED raids: బెంగాల్ టీఎంసీ ఎమ్మెల్యే సుదీప్తా రాయ్ నివాసం, నర్సింగ్ ఈడీ దాడులు

by Shamantha N |
ED raids: బెంగాల్ టీఎంసీ ఎమ్మెల్యే సుదీప్తా రాయ్ నివాసం, నర్సింగ్ ఈడీ దాడులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి మాజీ ప్రిన్సిపల్, టీఎంసీ ఎమ్మెల్యేల చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఫామ్ హౌజ్ పై ఈడీ సోదాలు చేస్తోంది. శ్రీరాంపూర్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే సుదీప్తా రాయ్ నివాసం, నర్సింగ్ హోంలోనూ ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ గా ఉన్నారు. సుదీప్తా గతంలో ఆర్జీకర్ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్ గా రాయ్ పనిచేశారు. ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం జరిగిన కొన్నిరోజులకే ఆయన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కాగా.. ఇప్పుడు ఈడీ ఆ ఆరోపణలపై విచారణ జరుపుతోంది. మరోవైపు, సుదీప్తా రాయ్ కి డాక్టర్ సందీప్ ఘోష్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు, ఈ కేసుకి సంబంధించి తన నివాసంలోనే సుదీప్తా రాయ్ ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఈడీ దర్యాప్తు

ఆగస్టు 9న జరిగిన హత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సందీప్ ని గతంలో ప్రశ్నించిన సీబీఐ.. ఇటీవలే అతడ్ని అరెస్టు చేసింది. కాలేజ్ అభివృద్ధి, పరిశోధన ప్రాజెక్టుల కోసం ఉద్దేశించిన నిధులను సందీప్ ఘోష్ దుర్వినియోగం చేశారని ఫిర్యాదులు రావడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈనెల ప్రారంభంలో సందీప్ ఘోష్‌కు సంబంధించిన సోదాల్లో పలు ఆస్తిపత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed