కేటీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయిన మహిళా నాయకురాలు పేరు ఇప్పుడు మళ్లీ తెరపైకి..

by S Gopi |   ( Updated:2022-12-06 11:02:25.0  )
కేటీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయిన మహిళా నాయకురాలు పేరు ఇప్పుడు మళ్లీ తెరపైకి..
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల సెస్ ఎన్నికల తెరపైకి మున్సిపల్ మాజీ చైర్మన్, కాంగ్రెస పార్టీ నుంచి సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన గుడ్ల మంజుల వస్తుండటంతో సిరిసిల్లలో రాకీయంగా హాట్ టాపిక్ గా మారుతుంది. మున్సిపల్ చైర్మన్ పదవి పూర్తయ్యాక దాదాపు 2005 నుంచి ఇప్పటివరకు గుడ్ల మంజుల రాజకీయంగా న్యూట్రల్ గానే ఉంది. సిరిసిల్ల పట్టణ రాజకీయాల్లో గుడ్ల మంజులకు మంచి పేరుంది. గుడ్ల ముంజుల పనితీరును చూసి.. దివాంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుడ్ల మంజులకు సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమంటే అంతా ఆశామాషీ కాదు. కానీ, దాదాపు పుష్కరకాలం తర్వాత సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గుడ్డ మంజుల బాలకిషన్ బయటి ప్రపంచానికి వస్తున్నారు. సిరిసిల్ల సెస్ టౌన్ 1 లో సెస్ డైరక్టర్ గా పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రిజర్వేషన్లు ఖరారు కాగానే సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్, అంభికానగర్, ప్రగతి నగర్లో ఒకేరోజు మూడు సమావేశాలు నిర్వహించడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతుంది. మళ్లీ రాజకీయాల్లో యాక్టీవ్ కావడానికి గుడ్ల మంజుల ప్రయత్నాలు ప్రారంభించి ఈ సెస్ ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తన భార్యను సెస్ డైరక్టర్ గా గెలిపించుకోవడానికి మంజుల భర్త గుడ్ల బాలకిషన్ సైతం సిరిసిల్ల పద్మశాలి ప్రముఖులతోపాటు.. ఇతర సామాజిక వర్గాల నేతలతో చర్చలు ప్రారంభించారు.

గుడ్ల మంజుల ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నప్పటికీ సెస్ ఎన్నికల్లో మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాడనికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. గుడ్ల మంజుల 2005లో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి.. 2005 నుంచి రాజకీయాల్లో కాస్తా సైలెంట్ గానే ఉందని చెప్పొచ్చు. సిరిసిల్ల టౌన్ 1 లో సెస్ రిజర్వేషన్ జనరల్ మహిళకు రావడంతో పలు పార్టీలు సైతం మహిళ నాయకురాళ్లు అభ్యర్ధిత్వం కోసం వేటా ప్రారంభించాయి. తమ పార్టీ ప్యానల్ కోసం పలువురు మహిళ నేతల అభ్యర్థిత్వం కోసం ఆయా పార్టీ ముఖ్య నాయకులు పరిశీలన చేస్తున్నారు. సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గుడ్ల మంజుల సెకండ్ ఇన్నింగ్ రాజకీయాలు ఆమె రాజకీయాల జీవితం మారుస్తుందా..? లేదా మరికొన్ని రోజులు సైలెంట్ గానే ఉండనుందా అని రాజకీయ చర్చ కొనసాగుతుంది.

Read more:

నెక్ట్స్ సీఎం ఎవరో ముందే చెప్పేసిన మంత్రి కేటీఆర్

Advertisement

Next Story