నైపుణ్యం ,సామర్థ్యం మెరుగుపడతాయి : రామగుండం సీపీ

by Aamani |
నైపుణ్యం ,సామర్థ్యం మెరుగుపడతాయి :  రామగుండం సీపీ
X

దిశ, గోదావరిఖని: రామగుండం కమిషనరేట్ లో గురువారం నాడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరుగుతుంది.దీనిలో భాగంగా గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు కాళేశ్వరం జోన్ పరిధిలోని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల్ జోన్, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్ లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్,ఐజీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ నిర్వహించడం జరుగుతుందని గురువారం నాడు కాళేశ్వరం జోన్ పరిధిలోని అధికారులకు మరియు సిబ్బంది సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం సాంకేతిక పరిజ్ఞానం, కేసుల దర్యాప్తులో మెళకువలు నేర్చుకునేందుకు అదేవిధంగా పోలీసు నైపుణ్యాలను ప్రదర్శించడానికి, సంక్లిష్టమైన కేసులు పరిష్కరించడానికి, ఆలోచనలను మార్పిడి పోలీసుల చేసుకోవడానికి తెలుసుకొనేందుకు డ్యూటీ మీట్ లో పాల్గొనేవారు ఒకరి నుండి మరొకరు అనుభవాలు పొందగలరు, వృత్తిపరమైన పనితీరు, సామర్థ్యం,మెరుగుదలకు పోలీస్ డ్యూటీ మీట్ దోహదపడుతుందన్నారు. ప్రతిభ చూపిన వారికి రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్ కు వివిధ ప్రాంతాల నుంచి పోలీసు అధికారుల మధ్య మరింత సహకారం, ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొనే వారందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించాలని ఇక్కడ ఎంపికై కాళేశ్వరం జోన్ తరపున మరియు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి రామగుండం కమిషనరేట్ కు, కాళేశ్వరం జోన్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ , అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, గోదావరిఖని ఏసీపీ రమేష్, సీసీఎస్ ఏసీపీ వెంకటస్వామి, ములుగు ఎసీపీ రాములు , ఏ ఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్ లు, ఆర్ ఐ లు దామోదర్, వామనమూర్తి, సంపత్ మల్లేశం, శ్రీనివాస్ లు, కమిషనరేట్ పరిధిలో, కొమురం భీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బంది, బీడి టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story