BSNL​ సేవలు పునరుద్ధరణ.. అన్ని రకాల సేవలు అందుబాటులోకి

by Hamsa |
BSNL​ సేవలు పునరుద్ధరణ.. అన్ని రకాల సేవలు అందుబాటులోకి
X

అగ్ని ప్రమాదంలో కాలిపోయిన బీఎస్​ఎన్​ఎల్​ సేవలను అధికారులు ఎట్టకేలకు పునరుద్దరించారు. సుమారు తొమ్మిది రోజుల పాటు శ్రమించిన అధికారులు వినియోగదారులకు అందిస్తున్న అన్ని రకాల సేవలను పునరుద్ధరించినట్లు ప్రకటించారు. ఈ నెల 22న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కరీంనగర్​ బీఎస్​ఎన్​ఎల్​ కార్యాలయం పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. విద్యుత్​ షార్ట్​ సర్కూట్​తో జరిగిన ఈ ప్రమాదంలో రూ.2 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దీంతో కరీంనగర్​, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో బీఎస్​ఎన్​ఎల్​ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల సేవలకు అంతరాయం కలిగినందుకు కస్టమర్లకు బీఎస్​ఎన్​ఎల్​ అధికారులు పలు రాయితీలను ప్రకటించారు. ప్రస్తుతం అందిస్తున్న సేవలకు మార్చి నెలలో 50 శాతం బిల్లు తగ్గించడంతోపాటు ప్రీపెయిడ్​ కస్టమర్లకు రీఛార్జి సేవల వ్యాలిడిటీని ఎనిమిది రోజులు పొడిగించారు. కస్టమర్లు ఎవరూ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండానే బీఎస్ఎన్ఎల్​ తీసుకున్న నిర్ణయాలు అమలవుతాయని అధికారులు తెలిపారు.

దిశ, కరీంనగర్​ బ్యూరో : అగ్ని ప్రమాదంలో కాలిపోయిన బీఎస్​ఎన్​ఎల్​ సేవలను అధికారులు ఎట్టకేలకు పునరుద్దరించారు. దాదాపు తొమ్మిది రోజుల పాటు శ్రమించిన అధికారులు వినియోగదారులకు బీఎస్​ఎన్​ఎల్ అందిస్తున్న అన్ని రకాల సేవలను పునరుద్ధరించినట్లు ప్రకటించారు. అయితే తొమ్మిది రోజుల పాటు బీఎస్​ఎన్​ఎల్ వినియోగదారులకు వివిధ రకాల సేవలకు అంతరాయం కలిగినందుకు కస్టమర్లకు బీఎస్​ఎన్​ఎల్​ అధికారులు పలు రాయితీలను ప్రకటించారు. ప్రస్తుతం అందిస్తున్న సేవలకు మార్చి నెలలో 50శాతం బిల్లు తగ్గించడంతోపాటు ఫ్రీపెయిడ్​ కస్టమర్లకు రిచార్జీ సేవల వ్యాలిడిటీని ఎనిమిది రోజులు పొడిగించారు.

షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం..

కరీంనగర్​ బీఎస్​ఎన్​ఎల్​ కార్యాలయంలో ఈ నెల 22న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో బీఎస్​ఎన్ఎల్​ కార్యాలయం పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. విద్యుత్​ షార్ట్​ సర్కూట్​తో జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.2కోట్ల ఆస్తినష్టం జరిగింది. దీంతో కరీంనగర్​, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో బీఎస్​ఎన్​ఎల్​ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ల్యాండ్​ ఫోన్లు, బ్రాడ్​ బ్యాండ్​ సేవలు, ఫైబర్​ సేవలతోపాటు సెల్​ ఫోన్​ ప్రీ పెయిడ్​, పోస్ట్​ ఫెయిడ్​ సిగ్నళ్లు సైతం పూర్తిగా నిలిచిపోయాయి. కరీంనగర్​ బీఎస్​ఎన్​ఎల్​ కార్యాలయం పరిధిలోని నాలుగు జిల్లాల్లో 3,724 ల్యాండ్​ ఫోన్లు, 6.751 ఫైబర్​ టూ హోం కనెక్షన్లు, 179 ఓఎల్​టీటీలు 2,61,515 సెల్​ఫోన్​ ప్రీ ఫెయిడ్​ వినియోగదారులతో పాటు 1,270మంది సెల్ ​ఫోన్​ పోస్ట్​ పెయిడ్​ కస్టమర్లు ఉన్నారు. అగ్ని ప్రమాదంలో బీఎస్​ఎన్​ఎల్​ కార్యాలయంలోని అన్ని పరికరాలు పూర్తిగా కాలిపోవడంతో నాలుగు జిల్లాలకు సేవలు నిలిచిపోయాయి.

పూర్తయిన పునరుద్దరణ పనులు..

బీఎస్​ఎన్​ఎల్​ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పరికరాలు పూర్తిగా కాలిపోవడంతో ఈ నెల 23 నుంచి అధికారులు పునరుద్దరణ పనులు చేపట్టారు. బీఎస్ఎన్​ఎల్​ వరంగల్​ జనరల్​ మేనేజర్ చంద్రమౌళి, కరీంనగర్​ డీజీఎం దినేష్​ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. పునరుద్దరణకు కావాల్సిన పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పరికరాలు తెప్పించి బీఎస్​ఎన్​ఎల్​ సేవలను ఎట్టకేలకు పునరుద్ధరించారు. గురువారం నాటికి 95శాతం పనులు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. మార్చి 31 సాయంత్రం వరకు అన్ని రకాల సేవలను పునరుద్దరిస్తామని తెలిపారు.

మార్చి బిల్లులో 50శాతం మాఫీ..

కరీంనగర్​ బీఎస్​ఎన్​ఎల్​ సేవలకు 8రోజుల పాటు అంతరాయం కలుగడంతో వినియోదారులకు సంస్థ పలు రాయితీలు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న అన్ని రకాల సర్వీస్‌లపై మార్చి నెల బిల్లులో 50శాతం తగ్గిస్తామని బీఎస్​ఎన్​ఎల్​ వరంగల్ జనరల్​ మేనేజర్​ చంద్రమౌళి తెలిపారు. సెల్​ ఫోన్​ వినియోదారులైన ప్రీ పెయిడ్ కస్టమర్లకు 8రోజుల అదనపు వ్యాలిడిటీ పెంచుతామని తెలిపారు. నిర్ణిత సమయం తరువాత మరో ఎనిమిది రోజులు యాదావిధిగా కొనసాగుతాయని చంద్రమౌళి తెలిపారు. రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించామని ఎవరూ బీఎస్​ఎన్​ఎల్​ ఆఫీసుకు రాకుండానే​ బీఎస్​ఎన్​ఎల్​ తీసుకున్న నిర్ణయాలు అమలవుతాయని చంద్రమౌళి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed