Civil Supply Chairmanగా సర్దార్ జీ... కూతురి పెళ్లికి సీఎం గిఫ్ట్

by S Gopi |   ( Updated:2022-12-08 13:03:35.0  )
Civil Supply Chairmanగా సర్దార్ జీ... కూతురి పెళ్లికి సీఎం గిఫ్ట్
X

దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ను రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం జీఓ ఆర్టీ 2313 నెంబర్ ద్వారా రవీందర్ సింగ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జీఓ విడుదల చేశారు. కరీంనగర్ లో రవీందర్ సింగ్ కూతురు వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు. సీఎం వివాహ వేడుక నుండి వెల్లిపోయిన కొద్ది సేపట్లోనే ఉత్తర్వులు వెలువడడంతో సర్దార్జీ కూతురి పెళ్లికి సీఎం గిఫ్ట్ ఇచ్చారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కొంతకాలంగా రవీందర్ సింగ్ కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు ఉన్నప్పటికీ అనూహ్యంగా ఈరోజు ఆ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం.



Advertisement

Next Story

Most Viewed