- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా రాపెల్లి లక్ష్మీ నారాయణ
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్ల కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ గా రాపెల్లి లక్ష్మి నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా శుక్రవారం బ్యాంక్ పాలక వర్గం కొలువుదీరింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జిల్లా సహకార శాఖ అధికారి బుద్దనాయుడు సమక్షంలో జరిగింది. గురువారం జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్యానెల్ నుంచి 8 మంది డైరెక్టర్ లు గెలువడంతో ఆ పార్టీకి చెందిన ర్యాపెల్లి లక్ష్మినారాయణ చైర్మన్ గా, అడ్డగట్ల మురళి వైస్ చైర్మన్ గా లాంచనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. బీజేపీ ప్యానెల్ నుంచి డైరెక్టర్ గా గెలిచిన పత్తిపాక సురేష్ చైర్మన్ కోసం ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ కాలేదు. దీంతో బీజేపీ డైరెక్టర్ చైర్మన్ ఎన్నిక నుంచి బయటకు వచ్చేశారు.
చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్
అర్బన్ బ్యాంకు ఎన్నికలు హోరా హోరీగా జరిగినప్పటికీ మొత్తం 12 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 8 మంది అభ్యర్థులు గెలుపొందారు. దాంతో బిఆర్ఎస్ పార్టీ అర్బన్ బ్యాంకు చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ముచ్చటగా మూడోసారి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. నూతనంగా ఏర్పడిన పాలక వర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోను ఇదే ఉత్సాహంతో పనిచేస్తామని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు.