- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గ్రూప్-1 పరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం: సీపీ
దిశ, వెబ్‌డెస్క్: రేపు జరగనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) నిర్వహిస్తున్న గ్రూప్-1 పరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కమిషనరేట్ పెద్దపల్లి-మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా 41 సెంటర్‌లలో 15, 482 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. పరీక్ష పేపర్లను స్ట్రాంగ్ రూంకు తరలించేందుకు రూట్ ఏర్పాట్ చేశామని వెల్లడించారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ పక్కాగా ఉంటుందని అన్నారు. కేంద్రాల వద్ద పార్కింగ్ స్థలాలను గుర్తించిన ప్రదేశంలో మాత్రమే అభ్యర్థులు వాహనాలు నిలపాలని సూచించారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ఎలాంటి శబ్దాలు లేకుండా చీఫ్ సూపరింటెండెంట్లు ముందు రోజే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.