- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Peddapalli: అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు నిల్... అల్లాడుతున్న చిన్నారులు
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని భట్టుపల్లిలో 1985లో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 38ఏళ్లు అవుతున్నా నేటికీ సొంత భవనం కలగానే మిగిలింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలోని వంటగదిలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఆ గదికి విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అసలే ఎండాకాలం కావడంతో తీవ్రమైన ఉక్కపోతకు చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని అంగన్‌వాడీ కేంద్రానికి సొంత భవనం మంజూరు చేసి అన్ని వసతులు కల్పించాలని కోరుతున్నారు.
దిశ, మంథని: మంథని మండలంలోని భట్టుపల్లిలో 1985లో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 38ఏళ్లు అవుతున్నా నేటికీ సొంత భవనం కలగానే మిగిలింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలోని వంటగదిలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఆ గదికి విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అసలే ఎండాకాలం కావడంతో తీవ్రమైన ఉక్కపోతకు చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సౌకర్యం లేని అంగన్వాడీ కేంద్రాలు వందల సంఖ్యలోనే ఉన్నాయి. వేసవి ఎండల తీవ్రత పెరిగిన క్రమంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చేసేదేమీ లేక చెమటలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల చేరడంతో ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. పది నిమిషాలు కరెంటు సరఫరా నిలిచిపోతే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొన్నది. అటువంటిది అంగన్వాడీ కేంద్రాల్లో అసలు విద్యుత్ సౌకర్యమే లేకపోతే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వేసవి దృష్ట్యా ఉదయం 8గంటల నుంచి 11గంటల వరకు కేంద్రాలు నిర్వహిస్తున్నప్పటికీ ఉక్కపోత సమస్య తప్పడం లేదు. అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే టీచర్లు సొంతగా ఫ్యాన్లు పెట్టుకోవాలని భావించినా కరెంట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు.
సుదీర్ఘకాలంగా సమస్యలు...
అంగన్వాడీ కేంద్రాల్లో కరెంట్ సౌకర్యం లేని విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలిసినా కంటితుడుపు హామీలు తప్ప చేసిందేమీ లేదు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడుస్తున్నా అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. జిల్లా వ్యాప్తంగా 706 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 235 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. మరో 160 పైగా కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో, సుమారు 300 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సొంత భవనాల్లో అధిక శాతం కరెంట్ సౌకర్యం లేనివే ఉన్నాయి. వేసవి ఎండల తీవ్రత పెరగడంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఉక్కపోత సమస్య తీవ్రమైంది. ఈ ప్రభావంతో వేసవిలో అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారులు, గర్భిణీలు బాలింతల సంఖ్య తగ్గిపోయిందని టీచర్లు చెబుతున్నారు.
ఏడాదంతా ఇబ్బందే...
అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల ఒక వేసవిలోనే గాక మిగతా రోజుల్లోనూ ఇబ్బందే ఎదురవుతుంది. టీచర్లు, సహాయకులు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ భవనాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. దశాబ్దాల కాలంగా కేంద్రాలు కరెంట్ సౌకర్యం లేకుండా కొనసాగుతుండడం గమనార్హం.
కరెంట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు : రౌఫ్ ఖాన్, డీడబ్ల్యూఓ
అంగన్వాడీ కేంద్రాల్లో కరెంట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తమ శాఖ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు కరెంటు సౌకర్యం కల్పించే ప్రొవిజన్ లేదు. ఇప్పటికే సర్పంచుల చొరవతో చాలా గ్రామాల్లో కరెంట్ సౌకర్యం కల్పించాం. మిగతా చోట్ల విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు సర్పంచ్‌లతో మాట్లాడుతాం.