- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష
దిశ, గోదావరిఖని: వైద్యవృత్తిని ఎంచుకున్న విద్యార్థులు ఎటువంటి విపత్కర పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం రామగుండంలోని సింగరేణి వైద్య కళాశాలలో నిర్వహించిన వైట్ కోట్ సెర్మొనీలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ వైద్యులుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా నిర్దేశించుకున్న లక్ష్యాలను వైట్ కోట్ సెర్మనీ గుర్తు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. గత 2.5 సంవత్సరాలుగా మీరు చేసిన కృషి ఫలితంగా గురువారం నాడు వైట్ కోట్ సెర్మొనీ లో పాల్గొంటున్నారని, ఇక్కడ విద్యార్థులు వివిధ ప్రాంతాలు, సామాజిక ఆర్థిక పరిస్థితుల నుంచి వచ్చిన వారు ఉన్నారని, ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృషి ఉందని అన్నారు.
సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గత 3 సంవత్సరాలుగా ఉన్నతమైన సేవలు అందిస్తుందని, విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్య కళాశాల గా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు సింగ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.