'రాజ్యాంగం నచ్చకపోతే రాజీనామా చెయ్'

by Disha News Web Desk |
రాజ్యాంగం నచ్చకపోతే రాజీనామా చెయ్
X

దిశ, గొల్లపల్లి: రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం గొల్లపెల్లి మండల కేంద్రంలో మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి తడగొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. దేశం కోసం అంబేద్కర్ తన కుటుంబాన్ని త్యాగం చేసి, దేశ ప్రజల కోసం రాజ్యాంగాన్ని రచించారని గుర్తుచేశారు. కానీ, సీఎం కేసీఆర్ తన కోసం, తన కుటుంబం కోసం, తన మనుగడ కోసం తెలంగాణను ఒక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని, అలాంటి ముఖ్యమంత్రికి రాజ్యాంగాన్ని విమర్శించే హక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''రాజ్యాంగం నచ్చకపోతే రాజ్యాంగబద్దంగా గెలిచినా నీవు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్'' అని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాసిన రాజ్యాంగం వల్లనే రాష్ట్రం ఏర్పడిందని, దాని ఫలింతంగానే ముఖ్యమంత్రివి అయ్యావని, రాజ్యాంగం ఫలితంగానే మీ కుటుంబ సభ్యులు మొత్తం పదవులు అనుభవిస్తున్నార కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ముల్కల శ్రీనివాస్, చెవులమద్ది గంగాధర్, మద్దూరి నవీన్, జెంగిలి ఎల్లయ్య, చెవులమద్ది సంతోష్, గంగాధర్ మధుసూదన్, సుద్దాల సంజయ్, జెరిపోతుల అనిల్, నక్క వినీష్, తుడుం నవీన్, తడగొండ హరీష్, శ్రీకాంత్, నిశాంత్, కాంపెల్లి షేకి, చందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story