- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మూసీ ప్రక్షాళన ఈరోజు ఆరంభించిన కార్యక్రమం కాదు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దిశ, జగిత్యాల ప్రతినిధి : మూసీ ప్రక్షాళన అనేది ఈరోజు ఆరంభించిన కార్యక్రమం కాదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇందిరా భవన్ లో నిర్వహించిన రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు కూడా మూసీ ప్రక్షాళన చేయాలని అనుకున్నా చేయలేకపోయాయని అన్నారు. ఈ అంశం ఏళ్లుగా మధ్యలోనే నిలిచిపోగా సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా ఎంచుకుందని తెలిపారు. ఇప్పటికే ఎస్టీపీలు( సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్) ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్షాళన ద్వారా మూసీలో కలుస్తున్న మురుగునీరు నుండి హానికర కెమికల్ సబ్ స్టాన్సెస్ తొలగించి ఆ నీటిని శుద్ధి చేసి సాగునీటి అవసరాలకు మళ్లించాలని ఆలోచనలో ఉందన్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు సైతం మూసీ ప్రక్షాళన వ్యతిరేకించడం లేదని నిర్వాసితులకు పునరావాసం విషయంలో మాట్లాడుతున్నారని అన్నారు.గత ప్రభుత్వాలు చేయలేనిది కాంగ్రెస్ చేస్తుందనే భావనలో ప్రతిపక్షాలు ఉన్నాయని అందుకే ప్రజలను గందరగోళానికి గురి చేసేలా మాట్లాడుతున్నారని అన్నారు.