- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెప్పులు కుట్టిన జాతిలో పుట్టా ఒక్కొక్కరి చర్మం ఒలిచేస్తా... ఎమ్మెల్యే రసమయి వార్నింగ్
దిశ, గన్నేరువరం: నేను చెప్పులు కుట్టే జాతిలో పుట్టాను నా జోలికొస్తే ఒక్కొక్కరి చర్మం ఒలిచేస్తా అని ప్రతిపక్షాలకు, యువజన సంఘాలకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బహిరంగ హెచ్చరిక జారీ చేశాడు. డబుల్ రోడ్డుకు రూ.71 కోట్లు మంజూరు అయ్యాయని బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఆవేశపూరితంగా సాగిన ప్రసంగంలో ఈ విధంగా మాట్లాడారు. తాను మాటలు చెప్పే వాడిని కాదని చేతలతోనే సమాధానం చెబుతా అని, అందుకే రోడ్డు మంజూరుకు నిధులు మంజూరు అయిన తర్వాతనే ఇక్కడి సమావేశంలో మాట్లాడుతున్నానని అన్నారు. ప్రతిపక్షాలకు రోడ్డు కావడం ఇష్టం లేదని, అందుకే రాజకీయ లబ్ధి కోసం రోడ్డు సమస్యను ముందుకు తీసుకువచ్చి లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు. యువజన సంఘాలు సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన రీతిలో పోస్టులు పెడితే బీఆర్ఎస్ శ్రేణులు ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు. గన్నేరువరం మండలం ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నది తానేనని గొప్పగా చెప్పుకున్నారు. త్వరలోనే మండలంలోని అర్హులకు డబుల్ బెడ్ రూమ్ పథకం కింద ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.