- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోరుట్ల పట్టణాన్ని సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దుతాం
దిశ, కోరుట్ల: కోరుట్ల పట్టణాన్ని సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తున్నట్లు కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మంగళవారం కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయం సమావేశ మందిరంలో చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్ అధ్యక్షతన అదనపు కలెక్టర్ మంద మకరంద్ ఆధ్వర్యంలో 2023 - 2024 ఆర్థిక సంవత్సరంనకు సంబంధించి బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుత కోరుట్ల పట్టణాన్ని అత్యుత్తమ పట్టణంగా తీర్చి దిద్దుటకు ఈ బడ్జెట్ రూపొందించబడిందని, కోరుట్ల పట్టణం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఉత్తమ స్థానం కలిగి ఉందని, రాబోవు రోజుల్లో కూడా ఆదాయ వనరులను పెంచుటకు కౌన్సిలర్లు మరియు ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, మున్సిపల్ కమిషనర్ ఎండీ అయాజ్, డిప్యూటీ ఈఈ అభినయ్, ఏఈ లక్ష్మి, జెఈఓ శివ, మేనేజర్ శ్రీనివాస్, ఆర్ఓ తిరుపతి, వార్డు కౌన్సిలర్లు, కో-అప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.