మందు బాబులకు అడ్డాగా మరిమడ్ల పల్లె ప్రకృతి వనం

by Javid Pasha |   ( Updated:2022-12-19 14:36:37.0  )
మందు బాబులకు అడ్డాగా మరిమడ్ల పల్లె ప్రకృతి వనం
X

దిశ, కోనరావుపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు మందు బాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. పల్లెలను దేశానికి పట్టు కొమ్మలుగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు, పాలక వర్గ నిర్లక్ష్యంతో లక్షల ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం పాలవుతోంది. పల్లెలు బాగుంటేనే ప్రజలు, దేశాలు బాగుంటాయనే ఉద్దేశంతో పల్లె ప్రకృతి వనాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మరిమడ్ల గ్రామంలో పల్లె ప్రకృతి వనం గ్రామానికి కాస్త దూరంగా ఉండటం, అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్ల మందు బాబులకు అడ్డాగా మారింది. ఎటు చూసినా మందు సీసాలు, పేపర్ ప్లేట్లు కుప్పలు కుప్పలుగా దర్శనం ఇస్తున్నాయి. ఆ పల్లె ప్రకృతి వనంలోకి వెళ్లి చూస్తే ఒక వైన్స్ పర్మిట్ రూమ్ ను తలపించే విధంగా మారిపోయింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా దాదాపు రూ.7 లక్షల వరకు నిధులతో పల్లె ప్రకృతి వన నిర్మాణం చేపట్టారు.


2020-21లో ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాల్లో పూర్తి స్థాయి లో మొక్కలు నాటారు. కానీ వాటి ఎదుగుదలకు నీళ్ళు పట్టాడం మాత్రి మరిచారు. దీంతో మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి. కానీ ఏనాడు అధికారులు ఈ వనాన్ని దర్శించిన దాఖలాలు లేవు. గ్రామ పంచయతీ పాలకవర్గం పట్టించుకోవడం మానేసింది. ఊరికి దూరంగా ఉండాల్సిన వైకుంఠ ధామాన్ని ఏమో ఊరికి దగ్గర్లో.. దగ్గర్లో ఉండాల్సిన పల్లె ప్రకృతి వనాన్ని ఏమో ఊరికి దూరంగా ఏర్పాటు చేశారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరికి దూరంగా ఉండటంతో పల్లె ప్రకృతి వనంలోకి వెళ్లడానికి స్థానికులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.


READ MORE

మేడ్చల్ BRS ఎమ్మెల్యేల రహస్య భేటీ.. తెరపైకి కొత్త అంశం!

Advertisement

Next Story

Most Viewed