ఏటీఆర్ అడవుల్లో అదుపు కానీ మంటలు... ఎంత ప్రయత్నించినా...

by S Gopi |
ఏటీఆర్ అడవుల్లో అదుపు కానీ మంటలు... ఎంత ప్రయత్నించినా...
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతం అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ ఏరియాలోని అమ్రాబాద్ డివిజన్ పరిదిలో సుమారు 15 ఫైర్ (ఇన్సిడెంట్స్) అడవి కాలుతున్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అడవి కాలకుండా రక్షించేందుకు మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. పై డివిజన్ పరిధిలోని మన్ననూర్, అమ్రాబాద్ మరియు దోమలపెంట అటవీ క్షేత్ర అధికారులు ప్రభాకర్ ఈశ్వర్ ఆదిత్య తమ సిబ్బందితో అడవి కాలుతున్న ప్రదేశాలకు వెళ్లి వారికున్న కొద్దిపాటి సౌకర్యాలతో మంటలు ఆర్పేందుకు కృషి చేస్తూనే ఉన్నారు.


అడవి ఎక్కడెక్కడా...?

అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలోని అక్క మహాదేవి బిలమ్, వటవర్లపల్లి బీట్ పరిధిలో, ఈగల పెంట సెక్షన్ మరియు శ్రీశైలం జాతీయ రహదారి న్యూ రోడ్ ఫర్హాబాద్ సౌత్ బీట్, తుర్కపల్లి సెక్షన్ అమ్రాబాద్ రేంజ్ లో బోరెటి బావి, మన్ననూర్ రేంజ్ పరిధిలో సుమారు 15 చోట్ల అడవి కాలుతుంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఉదయం నుండి అటవీ సిబ్బంది, 70 మంది ఫారెస్ట్ ఫైర్ వాచేర్స్, ఫైర్ టీమ్స్ QRT(క్విక్ రెస్పాన్స్ టీమ్)లు అలాగే శ్రీశైలం జాతీయ రహదారి మార్గం వెంట సుమారు పది గంటలకు పైగా ఫైరింజన్ అమ్రాబాద్ సహాయంతో అందరూ శ్రమిస్తూ మంటలను అదుపు చేయుటకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు.

100 హెక్టార్లలో...

నల్లమల్ల అటవీ అడవులు అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో ఫిబ్రవరి మొదటి వారం నుండి ఇప్పటివరకు పలుచోట్ల దాదాపు 20 సందర్భాలలో అడవి ఆహుతి అవుతున్న నేపథ్యంలో సుమారు 100 హెక్టార్లకు పైగా అడవి అగ్నికి ఆహుతి అయి ఉంటుందని అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. దాదాపు పది గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చామని అటవీ క్షేత్ర అధికారులు ప్రభాకర్, ఆదిత్య దిశకు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ రిస్క్యూ ఆపరేషన్ లో 8 టీంలు పాల్గొన్నారు. 6 టీమ్ లో తిరిగి వెనక్కి వచ్చాయని, మరో రెండు టీములు అడవిలోనే ఉన్నాయని, రాత్రి సమయంలో ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు చర్యలు తీసుకుంటారని వారు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed