- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రజాకార్ల పాలనను తరిమికొడదాం : బండి సంజయ్
దిశ, ముస్తాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పాలనకు అంతం పలికే సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నాడు. శనివారం ముస్తాబాద్ మండలం లో పర్యటించిన ఆయన గూడెం గ్రామంలో, ఎల్లారెడ్డి పేట మండలంలోని వెంకటాపుర్ గ్రామాల్లో శివాజీ విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శివాజీ విగ్రహాన్ని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలని అన్నాడు. మొగల్ సామ్రాజ్యకులు శివలింగాన్ని అపవిత్రం చేస్తే చిన్న వయసులో ఉన్న శివాజీ వారితో యుద్ధం చేసి తరిమికొట్టిన చరిత్ర ఉందన్నారు.
తెలంగాణ లో హిందు దేవుళ్ల ను అపవిత్రం చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారు కావచ్చు ...కానీ కాషాయ జెండా నీడలో పని చేసే మనం మాత్రం ఊరుకోమని రాష్ట్రం వ్యాప్తంగా అందరికి తెలుసు అని అని అన్నాడు. కండువా ఏది కప్పుకున్న పర్వాలేదు కానీ కాషాయ జెండా కి, హిందూత్వానికి విలువలు ఇవ్వాలని అనానరు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ జెండా ఎగరాలని, దానికి కార్యకర్తలు, మండల నాయకుల కృషి తప్పని సరి ఉండాలని అన్నారు. వందేళ్లు బతకడం గొప్ప కాదని, బతికినన్ని రోజులు మాత్రం గొప్పగా దేశం , ధర్మం కోసం బతకాలని సూచించారు.