- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్మిక ఆత్మీయ సంబరాలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
దిశ, కరీంనగర్ టౌన్: మే1 న కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో మే 1, 2న కార్మిక ఆత్మీయ సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కార్మిక శాఖ మరియు వివిధ సంక్షేమ శాఖల అధికారులతో మే డే ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కార్మికులుగా గుర్తింపు పొందిన లబ్ధిదారులందరికి పరిహార చెక్కులను పంపిణీ చేయాలని సూచించారు.
సీఎస్పీ హెల్త్ కేర్ ద్వారా నేటి నుంచి మేడే వరకు హెల్త్ క్యాంపులను నిర్వహించి వివిధ రక్త పరీక్షలను, ఉపిరితిత్తులు, కంటి, చెవి, ఈసీజీ మొదలైన 132 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో కార్మిక సంక్షేమ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించి మే 1న భూమి పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మికశాఖ అధికారి రమేష్ బాబు, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు సంపత్, పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాoత్, సహాయ ఎంవీఐ రజినిదేవి, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాస్, సీఎస్సీ హెల్త్ కేర్ అధికారి, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.