నియోజకవర్గ అభివృద్ధికి రూ. 5.60 కోట్లు మంజూరు.. కోరుట్ల ఎమ్మెల్లే విద్యాసాగర్ రావు

by Javid Pasha |   ( Updated:2023-02-04 12:47:43.0  )
నియోజకవర్గ అభివృద్ధికి రూ. 5.60 కోట్లు మంజూరు.. కోరుట్ల ఎమ్మెల్లే విద్యాసాగర్ రావు
X

దిశ, కోరుట్ల : కోరుట్ల నియోజకవర్గం అభివృద్ధి కోసం 5 కోట్ల 60 లక్షల రూపాయలు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మంజూరు అయినట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నిధుల మంజూరు పత్రంను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు అందజేశారు. కోరుట్ల మండలం జోగినిపెల్లి నుండి కల్లూరు రోడ్డు నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు కాగా కల్లూరు నుండి ధర్మారం రోడ్డు నిర్మాణానికి 70 లక్షలు, మల్లాపూర్ మండలం చిట్టాపూర్ నుండి గుండంపెల్లి 1.20 కోట్లు, రేగుంట నుండి వేంపెల్లి రోడ్డు 1.20 కోట్లు, చిట్టాపూర్ గ్రామంలో రోడ్డు నిర్మాణాలకు 40.00 లక్షలు, మెట్ పల్లి మండలం జగ్గాసాగర్, మెట్ల చిట్టాపూర్ గ్రామాలకు 20.00 చొప్పున మంజూరు అయ్యాయి. అలాగే కోమటి కొండాపూర్, జోగినిపెల్లి గ్రామలకు 15 లక్షలు చొప్పున మంజూరు కాగా, ఆత్మకూరు మరియు అయిలాపూర్ గ్రామాలకు 10 లక్షల చొప్పున, మల్లాపూర్, తిమ్మాపూర్, వర్షకొండ, వేంపల్లి గ్రామాలకు 5 లక్షల చొప్పున నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Next Story