కొండగట్టు ఆలయ ఉద్యోగిపై వేటు

by Sridhar Babu |
కొండగట్టు ఆలయ ఉద్యోగిపై వేటు
X

దిశ, కొండగట్టు : అక్రమాలకు పాల్పడిన కొండగట్టు ఆలయ ఉద్యోగిపై వేటు పడింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అన్నదాన సత్రంలో ఈనెల 9వ తేదీన సత్రం ఇన్చార్జి రాములు 50 కిలోల బియ్యం, ఇతర సామాగ్రి మాయం చేసిన సంఘటన సీసీ ఫుటేజ్ ఆధారంగా వెలుగులోకి వచ్చింది. దాంతో మంగళవారం బియ్యం బస్తాలు తరలించిన, గ్యాస్ సిలిండర్లు సప్లై చేసే వాహన డ్రైవర్​ని విచారించి రాములును విధుల నుండి సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. ఆయన స్థానంలో ధర్మేంద్రకు బాధ్యతలు అప్పజెప్పినట్లు ప్రకటించారు.

Next Story