- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అశ్రునయనాలతో కొమిరెడ్డి రాములు అంతిమ యాత్ర
దిశ, మెట్ పల్లి: మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు మృతితో నియోజకవర్గ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం ఉదయం మరణించిన రాములు పార్థీవ దేహాన్ని మెట్ పల్లిలోని తన స్వగృహంలో అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉంచారు. శుక్రవారం పాత బస్టాండ్ నుంచి రాములు స్వగ్రామం వెంకట్రావుపేట వరకు అంతిమయాత్రతో బయలుదేరి రాములు వ్యవసాయ క్షేత్రంలో దహన సంస్కారాలు నిర్వహించారు.జగిత్యాల జిల్లా నలుమూలల నుంచు కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు సైతం అంతిమ యాత్రలో పాల్గొన్నారు.హైదరాబాద్ నుంచి పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్వకేట్లు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాములుకు భార్య జ్యోతి, ముగ్గురు కుమారులున్నారు. అంతిమ యాత్రలో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కటకం మృత్యుంజయన్, ఆది శ్రీనివాస్, సునీతావెంకట్, మామిడి నారాయణ, జువ్వాడి నర్సింగ రావు, కృష్ణారావు, రాజేశం గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ సుజాత సత్యనారాయణ, కల్వకుంట్ల సుజిత్ రావు, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు, కాంతి మోహన్ రెడ్డి, పుప్పల లింబాద్రి, ఆకుల లింగారెడ్డి, రాష్ట్ర, జిల్లా న్యాయవాదులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.