హోటల్ ఫుడ్ లో ఐరన్ స్ప్రింగ్

by Sridhar Babu |
హోటల్ ఫుడ్ లో ఐరన్ స్ప్రింగ్
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల పట్టణంలో ఆహార నాణ్యతకు పేరు గాంచిన కొన్ని హోటళ్లలో ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనలు సంచలనంగా మారాయి. కొద్దిరోజుల క్రితమే పట్టణంలోని గణేష్ ఉడిపి హోటల్ లో ఇడ్లి లో జెర్రీ రావడంతో కస్టమర్ హోటల్ నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. అది జరిగిన రోజుల వ్యవధిలోనే కొత్త బస్టాండ్ సమీపంలో గల ముత్తు టిఫిన్ సెంటర్లో ఇడ్లీలో ఏకంగా పెద్ద సైజు బొద్దింక రావడంతో కస్టమర్ ఖంగుతున్నాడు. ఇటీవల జరిగిన ఈ రెండు సంఘటనలు మరువక ముందే జగిత్యాల పట్టణంలోని సామంతుల స్వగృహ భోజనశాలలో మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్లిన ఒక కస్టమర్ కు అన్నంలో స్ప్రింగ్ వచ్చింది. దీంతో వెంటనే హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కష్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం కామన్ అంటూ హోటల్ యజమాని చెప్పడంతో కస్టమర్ మండిపడ్డారు. అంతే కాకుండా ఏం చేస్తావో చేసుకో అంటూ దురుసుగా వ్యవహరించాడు. కొంతకాలం క్రితం ఇదే సామంతుల స్వగృహ భోజనశాలలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్ లో నాణ్యత లోపాలున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా 2,50,000 రూపాయలు ఫైన్ విధించడంతో 50 వేల రూపాయలు చెల్లించిన సదరు యజమాన్యం మరో రెండు లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంది. అలర్ట్ గా ఉండాల్సిన హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి ఫుడ్ లో వచ్చిన స్ప్రింగ్ వంటి ఐరన్ ముక్క అద్దం పడుతుంది. అయితే అది ఐరన్ స్ప్రింగా లేక పాత్రను క్లీన్ చేయడానికి ఉపయోగించే ఐరన్ స్క్రబ్బర్ కు సంబంధించిన పీసా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ను వివరణ కోరగా విషయం తమ దృష్టికి వచ్చిందని ఎంక్వయిరీ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed