Petrol Consume : ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలు ఆన్‌లోనే ఉంచుతున్నారా? ఒక్క నిమిషానికి పెట్రోల్/డీజిల్ ఎంత కాలుతుందంటే..?

by Anjali |   ( Updated:2024-11-14 11:08:50.0  )
Petrol Consume : ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలు ఆన్‌లోనే ఉంచుతున్నారా? ఒక్క నిమిషానికి పెట్రోల్/డీజిల్ ఎంత కాలుతుందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రద్దీగా ఉండే ప్రాంతాల్లో సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ పడుతుంటాయి. రెడ్ సిగ్నల్ పడితే తప్పకుండా వాహనాన్ని ఆపాల్సిందే. వాహనాల రద్దీని బట్టి నిమిషం నుండి దాదాపు ఐదు నిమిషాల పాటు ఆగాల్సి వస్తోంది. అయితే ఈ క్రమంలో నూటికి తొంభైతొమ్మిది మంది కారు లేదా బైక్‌ను ఆఫ్ చేయకుండా అలాగే ఉండిపోతారు. ఒక్క నిమిషమే కదా అనుకుంటారు. అలా గ్రీన్ లైట్ వచ్చేవరకు కారు, బైక్‌ను ఆన్‌లోనే ఉంచుతారు. ఇలాంటి సమయంలో కారు, బైక్ 1 నిమిషంపాటు ఆన్ చేసుంటే ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది మరీ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సిగ్నల్ దగ్గర బైక్ లేదా కారు ఆన్‌లో ఉన్నప్పుడు పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) వాడకం కారు ఇంజిన్(Engine) సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కారు ఇంజిన్ 1000 నుంచి 2000సీసీ మధ్య ఉన్నట్లైతే.. ఒక నిమిషం ఆగితే 0.01 నుంచి 0.02 లీటర్ల పెట్రోల్ కాలుతుంది. కాగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కారును ఆఫ్ చేయడం బెటర్. చిన్న ఇంజిన్‌ వాహనాలు అయితే ఒక్క నిమిషంలో 0.01 లీటర్ పెట్రోల్‌ను వాడుతుంది. అంటే ఇవి 100 నుంచి 1200సీసీ వరకు ఉంటాయి. 1500సీసీ మిడిల్ రేంజ్ ఇంజిన్‌వి 1 మినిట్‌కు 0. 015 లీటర్ల పెట్రోల్‌ కాలుతుంది.

2000 సీసీ ఉన్న పెద్ద ఇంజిన్లు అయితే ఒక్క నిమిషానికి 0. 02 లీటర్లు.. అప్పుడప్పుడు ఎక్కువ కూడా ఉపయోగించవచ్చు. కాగా ఒకే నెలలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చాలా సార్లు ఆగితే.. పెట్రోల్ వినియోగానికి దారితీస్తుంది. కాగా సిగ్నల్స్ వద్ద వాహనాలను ఆఫ్ చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఒకవేళ కారు ఆపే సమయం 30 సెకన్ల కంటే ఎక్కువ ఉన్నట్లైతే.. పెట్రోల్ కాలకుండా ఉండటానికి ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పొగ వెలువడడం ఆగుతుంది. అలాగే పర్యావరణ కాలుష్యం(Environmental pollution) కూడా తగ్గుతుంది.

Advertisement

Next Story