- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Deputy CM Pawan:డిప్యూటీ సీఎం పవన్‌తో తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రతినిధులు భేటీ
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో(Deputy CM Pawan Kalyan) తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రతినిధులు ఈ రోజు(గురువారం) ఉదయం భేటీ అయ్యారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) క్యాంపు కార్యాలయం(Camp Office)లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు, కాంచి, మధురై, చెంగల్ పట్, మధురై, తిరువళ్ళూరు, తిరుత్తణి ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉన్నారని తెలిపారు. వివిధ రంగాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు.
చెన్నైలో తెలుగు భవనం నిర్మాణం(Construction of Telugu building) చేపట్టాల్సి ఉంది. జయలలిత గారు ఈ భవనం నిర్మాణానికి అంగీకారం తెలిపారని కాలక్రమంలో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు అని వెల్లడించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తెలుగు భవనం నిర్మాణం పై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. తమ ఫౌండేషన్ తరఫున చేస్తున్న సామాజిక సేవలను, తెలుగు భాష, సంస్కృతుల కోసం చేస్తున్న కృషిని వివరించారు. ఫౌండేషన్ చేస్తున్న సేవలను డిప్యూటీ సీఎం పవన్(Deputy CM Pawan) అభినందించారు. ఈ భేటీలో ఫౌండేషన్ ప్రతినిధులు(Foundation representatives) శ్రీ దేవరకొండ రాజు, ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు, శ్రీ ఎ.ఎం.మనోజ్, శ్రీమతి ప్రియా శ్రీధర్, శ్రీ బి.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.