Sanjay Majrekar: కోహ్లిని కట్టడి చేసేందుకు ఆసిస్ ఆ వ్యూహం సిద్ధం చేస్తోంది.. మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
Sanjay Majrekar: కోహ్లిని కట్టడి చేసేందుకు ఆసిస్ ఆ వ్యూహం సిద్ధం చేస్తోంది.. మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్, గవస్కర్ టోఫ్రీ (Border, Gavaskar Trophy) ప్రారంభం కాకముందే టీమిండియా (Team India) అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. నవంబర్ 22 నుంచి పెర్త్ (Perth) వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో సిరీస్‌ ఆరంభం కానుంది. ఇటీవలే న్యూజిలాండ్ (New Zealand) చేతిలో వైట్‌వాష్‌ (White Wash)కు గురైన మన జట్టు.. ఆసిస్‌ను మట్టి కరిపిస్తుందా.. లేక చేతులెత్తేస్తుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియా (Australia) పర్యటన అనగానే అందరి కళ్లు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి (Virat Kohli)పైనే ఉంటాయి. కంగారు జట్టు కూడా కింగ్ కోహ్లి (King Kohli)ని కట్టడి చేసేందుకు ఇప్పటికే వ్యాహాలు రచిస్తోంది.

ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ (Sanjay Majrekar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా జట్టు (Australia Team) వ్యూహాలు ఏంటో అతడికి తెలుసని అన్నారు. అందుకు తగినట్లుగానే అతడు బ్యాటింగ్ ప్రాక్టీస్‌ (Batting Practice)ను మొదలు పెట్టాడని తెలిపారు. ప్రత్యర్థి బౌలర్లు ఖచ్చితంగా ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌తో కోహ్లి కవ్విస్తారని.. కానీ తెలివిగా ఆ బంతులను అతడు వదిలేస్తాడని పేర్కొన్నాడు. ఒకవేళ పర్‌ఫెక్ట్ బంతి కరెక్ట్ ప్లేస్‌లో ల్యాండ్ అయితేనే డ్రైవ్ చేస్తాడని మంజ్రేకర్ అన్నారు. ఇటీవల విరాట్ కోహ్లిని కట్టడి చేసేందుకు బౌలర్లు బౌన్సర్లను అస్త్రంగా వాడుతున్నారని గుర్తు చేశారు. ఈ విషయంలో అతడు జాగ్రత్తగా ఉంటాడని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story