Indira Gandhi : ఇందిరాగాంధీ ఉండి ఉంటే.. బీజేపీకి నామరూపాలు ఉండేవి కావు : నానా పటోలే

by Hajipasha |
Indira Gandhi : ఇందిరాగాంధీ ఉండి ఉంటే.. బీజేపీకి నామరూపాలు ఉండేవి కావు : నానా పటోలే
X

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ(Indira Gandhi) ఇప్పుడు ఉండి ఉంటే.. రాజకీయాల్లో బీజేపీ(BJP)కి నామరూపాలు ఉండేవి కావని మహారాష్ట్ర కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు నానా పటోలే(Patole) వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ స్వర్గం నుంచి దిగొచ్చినా ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరగదని ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన కామెంట్‌పై పటోలే స్పందించారు. ‘‘ఇందిరాగాంధీ మన దేశానికి ప్రధానిగా 15 ఏళ్లకుపైగా సేవలు అందించారు. ఒకవేళ ఆ మహనీయురాలు ఇప్పుడు బతికి ఉండి ఉంటే.. బీజేపీ అనే పేరే ఎవ్వరికీ వినిపించేది కాదు’’ అని ఆయన కౌంటర్ ఇచ్చారు.

‘‘ఇప్పుడు రాహుల్ గాంధీని చూస్తే బీజేపీకి దడ పుడుతోంది. కలలో కూడా వాళ్లకు రాహులే కనిపిస్తున్నారు’’ అని పటోలే పేర్కొన్నారు. ‘‘ఆర్టికల్ 370 రద్దుతో ఏం సాధించారో అమిత్ షా చెప్పాలి. జమ్మూకశ్మీరులో ఉగ్రవాద దాడులు ఆగడం లేదు. సైనికులు అమరులవుతూనే ఉన్నారు’’ అని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed