- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ED Raids: మహారాష్ట్ర, గుజరాత్‌లోని 23 చోట్ల ఈడీ దాడులు.. మనీలాండరింగ్ కేసులో చర్యలు
దిశ, నేషనల్ బ్యూరో: మాలెగావ్‌లోని సిరాజ్ అహ్మద్ (Siraj ahmad) అనే వ్యాపారికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Ed) మహారాష్ట్ర, గుజరాత్‌లోని 23 ప్రాంతాల్లో గురువారం సోదాలు చేపట్టింది. రూ.100 కోట్ల విలువైన లావాదేవీలు జరిపేందుకు ఆ వ్యాపారి బ్యాంకు ఖాతాలు(Bank accounts) తెరిచేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించినట్టు ఈడీ ఆరోపించింది. మహారాష్ట్రలోని మాలెగావ్, నాసిక్, ముంబై గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్‌లలో తనిఖీలు చేపట్టింది. హవాలా లావాదేవీలను వెలికితీయడంతో పాటు, అక్రమ బ్యాంకింగ్ కార్యకలాపాలలో పాల్గొన్న వారిని గుర్తించడమే లక్ష్యంగా ఈ సోదాలు చేపట్టినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, నాసిక్ మర్చంట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో బ్యాంకు ఖాతాలు తెరవడానికి సిరాజ్ దాదాపు డజను మంది కేవైసీ పేపర్లు, పాన్, ఆధార్ తీసుకున్నాడని ఆరోపణలున్నాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. నిందితుడు మొత్తం 14 బ్యాంకు ఖాతాలు తెరవగా వాటి ద్వారా 2200 లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఖాతాల ద్వారా రూ. 112 కోట్లు కాగా క్రెడిట్ కాగా, 315 డెబిట్ లావాదేవీలు గుర్తించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు తాజాగా సోదాలు జరిపినట్టు వెల్లడించారు. అయితే ఎన్నికల వేళ మహారాష్ట్రలో సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.