CM Revanth : నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

by Ramesh N |
CM Revanth : నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆయనకు నివాళులు అర్పించారు. గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో నెహ్రూ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

స్వతంత్ర భారత రూపశిల్పి జవహర్ లాల్ నెహ్రూ (Nehru) జయంతి పురస్కరించుకుని నిర్వహించుకునే ‘జాతీయ బాలల దినోత్సవం’ సందర్భంగా సీఎం బాలబాలికలకు అందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లలు జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని బోధించిన పండిట్ నెహ్రూ గారి ఆకాంక్షల మేరకు నేటి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం కోరారు. నెహ్రూ చిత్రపటానికి నివాళులు అర్పించిన వారిలో కాంగ్రెస్ నేతలు మధు యాష్కీ గౌడ్, రోహిన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story