- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jagga Reddy: కేసీఆర్, కేటీఆర్‌కు రాజభోగాల ఆకలి తీరలే.. జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR)కు రాజభోగాల ఆకలి ఇంకా తీరలేదని టీపీసీసీ వర్కింగ్ జగ్గారెడ్డి (Jagga Reddy) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) పాలనలో ఏదైనా ఫార్మా కంపెనీలు (Pharma Company) ఏర్పాటు చేయదలచుకుంటే ఏనాడైనా గ్రామ సభలు నిర్వహించారా అని ప్రశ్నించారు. గతంలో రైతులపై కూడా దాడులు చేయించారని గుర్తు చేశారు. నేడు ఆ రైతులనే రెచ్చగొట్టి కలెక్టర్, అధికారులపై కూడా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
మల్లన్నసాగర్ (Mallanna Sagar)లో రైతులను కొట్టి భూములను లాక్కున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేస్తున్న మంచి పనులు చూసి బీఆర్ఎస్ (BRS) నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు కుట్రలు చేశారని.. అధికారం కోల్పోయిన తరువాత కూడా బీఆర్ఎస్ (BRS) నేతలు అదే పని చేస్తున్నారని ఆరోపించారు. బలవంతంగా భూములను లాక్కొనే ఆలోచన ప్రభుత్వానికి లేనే లేదని అన్నారు. సర్కార్‌ను బద్‌నాం చేసేందుకు కేటీఆర్ (KTR) కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఒక్కొక్కటిగా నేరవేరుస్తున్నారని తెలిపారు.