MP Raghunandan Rao : పాత ముఖ్యమంత్రి చేసిన తప్పులనే రేవంత్ చేస్తున్నారు : ఎంపీ రఘునందన్ రావు

by Y. Venkata Narasimha Reddy |
MP Raghunandan Rao : పాత ముఖ్యమంత్రి చేసిన తప్పులనే రేవంత్ చేస్తున్నారు : ఎంపీ రఘునందన్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : పాత ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) చేసిన తప్పులనే సీఎం రేవంత్ రెడ్డి (Ravanth reddy) కూడా చేస్తున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Telugu News , Latest Telugu news , Latest News in Telugu విమర్శించారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ గడా సంస్థ పెట్టుకుంటే రేవంత్ కూడా కొడంగల్ కు కుడా సంస్థ పెట్టుకున్నాడని, ఖమ్మం మిర్చి యార్డులో నాడు రైతులను అరెస్టు చేసి బేడీలు వేసినప్పుడు విమర్శించి, మల్లన్న సాగర్ నిర్వాసితుల దగ్గర ధర్నా చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో రైతుల అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారన్నారు. మారింది కేవలం రంగుల జెండా మాత్రమే తప్పా.. రైతుల బతుకుల్లో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కూడా రైతులను మల్లన్న సాగర్ రైతుల తరహాలోనే లగచర్లలో అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని విమర్శి్ంచారు. నిజంగా ఫార్మా సిటి నిర్మించాలంటే గత ప్రభుత్వం సేకరించిన భూములలో ఏర్పాటు చేయవచ్చు కానీ వాటిని ఫార్మా కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

లగచర్ల దాడిలో నరేందర్ రెడ్డి, కేటీఆర్ లలో తప్పు చేసినోళ్లు ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనన్నారు. ఎన్నో ఫార్మా కంపెనీలు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయని, గతంలో సేకరణ చేసినటువంటి భూములను తమకు అందిస్తే అన్ని కంపెనీలను ఒకే చోట ఏర్పాటు చేస్తామని కంపెనీలు చెప్పినా ఈ ప్రభుత్వం వినిపించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని, కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా ఒకరు ఢిల్లీలో ఒకరు ముంబాయిలో కూర్చొని పరస్పరం విమర్శించుకుంటున్నారని మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు కేటీఆర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరూ కూడా చర్లపల్లిలో ఉండాల్సినటువంటి వాళ్ళని ఎద్దేవా చేశారు. ఇందులో ఒకరు ముందుగానే చర్లపల్లి వెళ్లిన వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇద్దరు కలిసి చర్లపల్లి జైలులో కూర్చోవాలన్నారు. మళ్లీ మేమే రాబోతున్నాం మేమే చేస్తున్నాం అని చెప్పుకున్న ఇరు పార్టీలు తమ గొప్పలను ప్రదర్శించకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు సజావుగా జరిపించాలని, హైడ్రా, మూసీ పేరిట ప్రజల ఆస్తులను కూల్చడం ఆపాలని, రాష్ట్ర ప్రభుత్వం పేరులోనే కాకుండా పాలనలో ప్రజా పాలన కనబర్చాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story