అరణ్య రోదన.. రంపపు కోతకు గురవుతున్న పచ్చని చెట్లు

by samatah |
అరణ్య రోదన.. రంపపు కోతకు గురవుతున్న పచ్చని చెట్లు
X

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎంతో అమూల్యమైన అటవీ సంపదను కలప స్మగ్లర్లు దర్జాగా దోసుకెళ్తూ అక్రమార్జనకు అడ్డాడారులు తొక్కుతున్న వైనం జిల్లాలో నెలకొన్నది. తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అడవులను పునరుద్దింపజేస్తుంటే, అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. పర్యవేక్షణ లోపంతో జిల్లాలోని అడవులు లూటీ అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 24వేల హెక్టార్ల అటవీ ఉంటే ఒక సిరిసిల్ల రేంజ్ పరిధిలో 18వేల హెక్టార్ల అటవీ భూమి ఉన్నట్లు ఆ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. కొందరు అక్రమార్కులు కొత్తపుంతలు తొక్కుతూ అక్రమార్జనే ధ్యేయంగా అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. టేకు చెట్లను నరకడానికి పెట్రోల్ సహాయంతో నడిచే రంపపు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సిరిసిల్ల రేంజ్ పరిధిలోని నర్మాల, గంభీరావుపేట పెద్దమ్మ, మద్దిమల్ల, వీర్నపెల్లి, పోతిరెడ్డి పల్లె అటవీ ప్రాంతాల్లోని టేకు చెట్లతోపాటు ఇతర చెట్లను కోసి కుప్పలు పెడుతున్నారు. అయితే వాటిని రాత్రి సమయంలో వాటిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి కలప అక్రమ రవాణాకు తెరలేపుతున్నారని జోరుగా చర్చ కొనసాగుతోంది.


దిశ, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ కలప రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎంతో అమూల్యమైన అటవీ సంపదను కొందరు కలప స్మగ్లర్లు దర్జాగా దోసుకెళ్తూ అక్రమార్జనకు అడ్డాడారులు తొక్కుతున్న వైనం జిల్లాలో నెలకొన్నది. తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అడవులను పునరుద్దింపజేస్తుంటే, అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో జిల్లాలోని అడవులు లూటీ అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 24వేల హెక్టార్ల అటవీ ఉంటే ఒక సిరిసిల్ల రేంజ్ పరిధిలో 18వేల హెక్టార్ల అటవీ భూమి ఉన్నట్లు అటవీ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. కొందరు అక్రమార్కులు కొత్తపుంతలు తొక్కుతూ అక్రమార్జనే ధ్యేయంగా అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. టేకు చెట్లను నరకడానికి పెట్రోల్ సహాయంతో నడిచే రంపపు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సిరిసిల్ల రేంజ్ పరిధిలోని నర్మాల, గంభీరావుపేట పెద్దమ్మ, మద్దిమల్ల, వీర్నపెల్లి, పోతిరెడ్డి పల్లె అటవీ ప్రాంతాల్లోని టేకు చెట్లతోపాటు ఇతర చెట్లను కూడా రంపపు యంత్రాలతో కోసి కుప్పలు పెడుతున్నారు. అయితే వాటిని రాత్రి సమయంలో వాటిని తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి కలప అక్రమ రవాణాకు తెరలేపుతున్నారని జోరుగా చర్చ కొనసాగుతోంది.

మందు.. విందు..

రాత్రివేళల్లో పనికి వచ్చే వారికి ముఠా నాయకుడు రంపపు కోత యంత్రాలను ఇచ్చి అడవికి తరలించి, వారికి తాగడానికి మద్యం, తినడానికి బిర్యానీ ప్యాకెట్లు అందజేసి తన పనిని సునాయాసంగా కొనసాగేలా పటిష్ట చర్యలు చేపడుతున్నారని సమాచారం. అలా ప్రతిరోజూ ఒక బృందం కలపను నరికి, కుప్పలుగా పెట్టడం, మరో బృందం రాత్రివేళల్లో ఆ కుప్పలను రావాణా చేయడం పరిపాటిగా మారిందని ఆయా ప్రాంతాల ప్రజలు గుసగుసలాడుకుంటన్నారు. ఈ పనులకు ముఖ్యంగా యువకులనే ఎంచుకుని వారిని మద్యానికి బానిసలను చేయడానికి కృషి చేస్తున్నారనే అపవాదు ఉంది. మద్యం మత్తులో టేకు దుంగలను నరుకుతున్న వారికి అడ్డు చెప్పే ధైర్యం లేక, అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నా చూస్తూ ఉండడం తప్ప ఏమి చేకలేకపోతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇంత దర్జాగా అక్రమ కలప రవాణా జరుగుతున్నా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కలప స్మగ్లర్లు అటవీశాఖ అధికారుల అండదండలతోనే టేకు కలపను రవాణా చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అయితే అటవీ శాఖ అధికారుల సహకారంతోనే కలప రవాణా జరుగుతోందని, అటవీ సిబ్బందిని మొదలుకొని రేంజ్ అధికారుల వరకు పెద్దఎత్తున ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జిల్లాలోని గుండారం, గజసింగవరం గ్రామాల మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో ఓ అధికారి సహకారంతో 10 మీట్లర్ల పైగా పొడవు గల సుమారు యాభై టేకు చెట్లను నరికినట్లు, ఆ దుంగలను ఓ గ్రామంలోని కలప పనిచేసే వ్యక్తి ఇంట్లో దాచి ఉంచినట్లు సమాచారం. దీంతో ఓ ప్రజాప్రతినిధి తన అనుచరులతో కలిసి స్మగ్లర్ ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. తమ గ్రామ శివారు చెట్లు కొట్టేశారని, ఆ దుంగలను తన గ్రామ ప్రజలకు అప్పగించాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది.

అక్రమ కలప రవాణా జరగడం లేదు

ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతంలో అసలు అక్రమ కలప రవాణా జరగడం లేదని, ఎందుకంటే ఈ ప్రాంతంలో పెద్దపెద్ద టేకు వృక్షాలు లేవని అటవీ శాఖ సిరిసిల్ల క్షేత్రస్థాయి అధికారి చెప్పుకొచ్చారు. అధికారి మాటలు స్మగ్లర్లు చెట్లను చిన్నగా ఉన్నప్పుడే నరుకుతున్నారన్న అనుమానాలకు తావిస్తున్నాయి. దీనిని బట్టి అధికారులు ఏస్థాయిలో పని చేస్తున్నారనే తీరుకు అద్దం పడుతుంది. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు వంకర బుద్ది మానుకొని, అక్రమ కలప రవాణా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపి జిల్లలోని అటవీ సంపదను కాపాడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story