Degree College : సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఆకస్మిక తనిఖీ..

by Sumithra |
Degree College : సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఆకస్మిక తనిఖీ..
X

దిశ, వేములవాడ : విద్యార్థులకు నిత్యం నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ పట్టణ సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో మాట్లాడారు. విద్యాలయంలో వసతులు, పాఠ్యాంశాల బోధన గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాలకు వినియోగించే కూరగాయలు, వస్తువులను, సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ విద్యాలయంలో స్వచ్చత.. పరిశుభ్రత పాటించాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు.

బియ్యం నాణ్యత పై అసంతృప్తి..

తనిఖీల్లో భాగంగా వంటకు వినియోగించే బియ్యాన్ని పరిశీలించిన విప్, కలెక్టర్ లు వాటి నాణ్యత పై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యంలో నాణ్యత లోపించిందని వెంటనే వాటిని మార్చి వేరే బియ్యం తెప్పించాలని ఆదేశించారు. అట్లాగే సాంబార్ లో పప్పు శాతం తక్కువగా ఉండి, నీళ్ల శాతం ఎక్కువగా ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed