బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ గుడ్ బై..

by Shiva |   ( Updated:2023-08-23 09:19:10.0  )
బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ గుడ్ బై..
X

దిశ, క‌రీంన‌గ‌ర్: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ బుధవారం ప్రకటించారు. 2018లో ఎటువంటి ప‌ద‌వీ ఆశించ‌కుండా బీఆర్ఎస్ పార్టీలో చేరాన‌ని, ఆ పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాన‌ని అన్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఎటువంటి అవ‌కాశం ల‌భించ‌లేద‌ని తెలిపారు. దీంతో తన రాజ‌కీయ భ‌విష్యత్తు నిమిత్తం బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు సంతోష్ తెలిపారు. శ్రేయోభిలాషులు, మిత్రులు కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కాంక్షించే పెద్దల సలహా మేరకు రాబోయే ఎన్నిల్లో చురుకుగా పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. తాను ఏ పార్టీలో చేరబోయేది అనే విషయం త్వరలో ప్రకటిస్తానని వెల్లడించాడు.

Read More : మాజీ మంత్రి తుమ్మల ఇంట్లో కీలక సమావేశం

Advertisement

Next Story