- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొమ్మిదేళ్లు గడిచినా.. ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు : ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
దిశ, మంథని : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడచినా గడిచినా ప్రజల ఆకాంక్ష మాత్రం నెరవేరలేదని ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. పట్ణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూనియర్ కళాశాల కూడలిలో శ్రీధర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించిన అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
అనంతరం క్యాంపు కార్యాలయంలో తొలి, మలిదశ ఉద్యమకారులను ఆయన సన్మానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలను కోరుకున్నారని తెలిపారు. రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని, కుక్కలు చింపిన వస్తరిలా, అప్పుల తెలంగాణగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.లక్ష అప్పు ఉందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నీరు మంథని ప్రాంతానికి అందడం లేదని, రెండు చోట్ల లిఫ్టులు ఏర్పాటు చేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. దళిత బంధు కొంతమందికే పరిమితం చేసి దళితులందరికీ అన్యాయం చేయొద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు. ఈ సమావేశంలో కాటారం ఎంపీపీ సమ్మయ్య, నాయకులు సెగ్గెం రాజేష్, శశి భూషణ్ కాచే, అజీమ్ ఖాన్, వొడ్నాల శ్రీనివాస్, మహేశ్వరి, రమ, శేఖర్, సత్యం, కిషన్, తదితరులు పాల్గొన్నారు