రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా.. అడ్లూరి లక్ష్మణ్ కుమార్

by Sumithra |   ( Updated:2023-06-15 14:11:58.0  )
రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా.. అడ్లూరి లక్ష్మణ్ కుమార్
X

దిశ, వెల్గటూర్ : కాలుష్యాన్ని వెదజల్లే మహమ్మారి అయినా ఇథనాల్ ప్రాజెక్టు వల్ల ప్రజలకు పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని మంత్రి కొప్పుల ఈశ్వర్ నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగాం ప్రజలతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై కొప్పుల ఈశ్వర్ చేసిన విమర్శల పై డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. రెండు నెలలుగా ఐదు గ్రామాల ప్రజలు ఇథనాల్ ప్రాజెక్టు కడితే తమ బతుకులు ఆగమయితాయని భయం భయంగా బతుకుతున్నారు. ఊర్లన్నీ ఏకమై కాలుష్యాన్ని వెదజల్లే ఇథనాల్ ప్రాజెక్టు ఇక్కడ కట్టొద్దని వ్యతిరేకిస్తున్న విషయం కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

ఇథనాల్ వద్దంటూ సామాన్య ప్రజలు నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు పోలీసులను ఎదిరించి ప్రాణాలకు తెగించి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇది నిజమని నీకు అనిపించడం లేదా, ప్రజలు చేసే పోరాటం బూటకం అంటావా, ఏనాడైనా ప్రజల వద్దకు వచ్చి ఈ ఫ్యాక్టరీ వల్ల జరిగే మంచి చెడుల గురించి వివరించావా, దానివల్ల మంచే జరుగుతుందని వారికి భరోసా ఇచ్చావా, ఇవ్వలేదు. ఇవన్నీ చేయని నీవు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం లేదు, దానివల్ల ప్రజలకు ఇబ్బంది లేదని నేను నిరూపిస్తే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముక్కునేలకు రాస్తావా అని జగిత్యాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈశ్వర్ చేసిన సవాల్ అందరికీ తెలిసిన విషయమే. మంత్రి విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు డీసీసీ 2004 అధ్యక్షులు ప్రకటించారు. మంత్రిగా నాకంటే పెద్ద హోదాలో ఉన్నావు.

ఇథనాల్ పరిశ్రమ మంచిదే అని నిరూపించడానికి డేటు టైము నువ్వే నిర్ణయించు. ఎక్కడికి రమ్మంటావు పర్లపల్లి, చిత్తనూరు, గుజరాత్ ఇంకా ఏ చోటుకైనా ప్రజల వైపు నుంచి రావడానికి నేను సిద్ధం అని అన్నారు. ప్రభుత్వం వైపు నుంచి నీవు రావాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు నుండి ఎలాంటి కాలుష్యం బయటకు రాదని నీవు నిరూపించగలిగితే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడంతో పాటు ప్రస్తుతం నీ మీద వేసిన ఎలక్షన్ పిటిషన్ కూడా వెనక్కి తీసుకుంటానని సవాల్ చేశారు . నీలాగా ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తి కాదు జీవన్ రెడ్డి. ఇథనాల్ పరిశ్రమపై ఢిల్లీలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టెక్నికల్ ఇంజనీర్ల తో మాట్లాడి కాలుష్యకారకమని తెలుసుకున్న తర్వాతనే రంగంలోకి దిగాడన్నారు. నీలాగా ముందు ప్రేమగా మాట్లాడి వెనుక గోతులు తీసే రకం మా కాంగ్రెస్ నైజం కాదని విమర్శించారు. గెలిచిణా ఓడిన పార్టీని మారకుండా ప్రజలతోనే ఉండి పోరాటం చేస్తామని గుర్తు చేశారు.

అయినా.. నీవు నేను ఒక్క దగ్గర నుంచే వచ్చినము. మీ అదృష్టం బాగుంది నువ్వు గెలిచినవు నేను ఓడిపోయాను.ఓడినా ప్రజల్లోనే ఉన్నాను. నా మీద ఏదో డాక్యుమెంటరీ తీయాలని ప్రయత్నం చేస్తున్నావని తెలిసింది, నా దగ్గరేముందే అంగిలాగు ప్రజలు తప్ప అని ఎద్దేవా చేశారు. ఒక్క ప్రశ్న సూటిగా అడుగుత చెప్పు 2004 ముందు నీ ఆస్తులు ఎంత, 2023లో ఎంతున్న యో ప్రజలకు తెలియ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో విల్లాలు కరీంనగర్ లో భూములు నెలకు 15 లక్షలు వెచ్చించి నిర్వహించే సోషల్ మీడియా ఓటుకు రూ. 5000 అయినా ఇచ్చి కొంటాను అనే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. వ్యాపారాలు చేసావా తాతల తండ్రుల నుంచి తరగని ఆస్తులు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అడుగు తీసి అడుగేస్తే ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ స్వప్రయోజ నాలతో ముందుకు సాగుతున్న నీకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు గురించి వాస్తవాలు చెప్పారు. వాస్తవాలను స్వీకరించలేని మీ వక్రబుద్ధిని ప్రైవేటు కార్యక్రమంలో బయట పెట్టుకున్నారు.

కాలేశ్వరంలో జరిగింది అవినీతి కాదా, ఎకరాకు రూ. 40 లక్షలు విలువ చేసే రైతుల భూములను 10 లక్షల కే బలవంతంగా గుంజుకుని బజారున పడేసింది మీరు కాదా,లింక్ టు ప్రాజెక్టును ఎవరికోసం నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతానికి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. బండగొట్టి బతికే 3000 ఒడ్డెర కుటుంబాల బతుకులను లింక్ టు పేరుతో రోడ్డున పడేశావు. రైతుల వడ్లను నిలువు దోపిడీ చేస్తున్న మిల్లర్ల గురించి ఎప్పుడైనా ప్రశ్నించావా, అందరినీ ఆ గం చేసి నీ జేబు నింపు కోవడమే ఒక్కటే లక్ష్యంగా పోలీసులను అడ్డంగా పెట్టుకుని పాలన సాగిస్తున్నావు. ప్రజలందరికీ నీ గురించి అర్థమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా తగిన గుణపాఠం చెబుతారని డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చ రించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, సర్పంచ్ మేరుగు మురళి ఎంపీటీసీ అనుమాల మంజుల, పూదరి రమేష్, సందీప్ రెడ్డి కుమారస్వామి గోళ్ళ తిరుపతి వెంకట స్వామి సత్యనారాయణ రావు, కూస లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed