- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్దపల్లి BRSలో నయావార్.. తగ్గేదేలే అంటున్న ఆ నాయకులు
దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీలో నయావార్ మొదలైనట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ ఒక వైపు, ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారు మరోవైపు అన్నట్టు సాగుతోంది రాజకీయం. పెద్దపల్లి ఎమెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధులు ఇన్నాళ్లు ఎడమొహం పెడమొహంగా ఉండగా, వారి నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వారిని కట్టడి చేయడానికి ఐక్యతా రాగం అందుకుంటున్నట్లు కనిపిస్తుంది. మండలిలో చీఫ్ విప్ గా ఎన్నికైన భానుప్రసాద్ రావుకు ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పుట్ట మధు చేసిన వ్యాఖ్యలకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మద్దతు పలకడంతో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లాలో సిట్టింగులు వర్సెస్ ఆశావాహులు అన్నట్లు కనిపిస్తుంది.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి దాసరి మనోహర్ రెడ్డి ఎన్నిక కాగా రామగుండం నియోజకవర్గం నుంచి ఆల్ ఇండియా ఫార్వాడ్ బ్లాక్ పార్టీ నుంచి కోరుకంటి చందర్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత చందర్ బీఆర్ఎస్ పార్టీలో చేరగా, మంథని నుంచి పోటీ చేసిన పుట్ట మధు 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పుట్ట మధు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు. మూడు నియోజకవర్గాల నుంచి వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధిష్టానం ఆశీస్సులతో పుట్ట మధు, మనోహర్ రెడ్డి, చందర్ బీఆర్ఎస్ పార్టీ తరుపున ఎన్నికల బరిలో నిలవాలని ఆశిస్తున్నారు.
మూడుచోట్ల కొరకరాని కొయ్యలుగా..
వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారు ముగ్గురు నేతలకు కొరకరాని కొయ్యలుగా మారారు. బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెద్దపల్లి నియోజకవర్గంలో మరీ ఎక్కువ అయింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఉండగానే జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, ఈద శంకర్ రెడ్డి, నల్లా మనోహర్ రెడ్డి, చిరుమల్ల రాకేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, పెంట రాజేష్ తదితరులు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న నాయకులు ఒక్కరు ఇద్దరు మినహా మిగిలిన వారు అందరు తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నచోట వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకే వస్తుందని చెప్పుకోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. రామగుండం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తోపాటు పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి వచ్చే ఎన్నికల్లో రామగుండం బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్‌గా ఉన్న కోలేటి దామోదర్‌తో పాటు సింగరేణిలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా పని చేస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకుడు మిర్యాల రాజి రెడ్డి, రామగుండం మున్సిపాల్ కార్పొరేషన్ మాజీ మేయర్ కొంకటి లక్ష్మినారాయణ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. మంథని శాసనసభ నియోజకవర్గం నుంచి 2018లో పోటీ చేసి ఓటమి చెందిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తుండగా కాటారం మండలానికి చెందిన చల్ల నారాయణ రెడ్డి, కర్రు నాగయ్యతో పాటు నీటి పారుదల శాఖలో పని చేస్తున్న ఓఅధికారి సైతం టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
కట్టడి చేయకపోతే కష్టమే..
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే చందర్‌లు గత కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్న తీరు జిల్లాలో పలుమార్లు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముగ్గురు మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి ఇప్పుడు ఐక్యతా రాగం అందుకున్నట్లు కనిపిస్తుంది. మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా ఎన్నికల భానుప్రసాద్ రావుకు పెద్దపల్లిలో ఇటీవల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టికెట్ ఆశిస్తున్న వారిని ఉద్దేశించి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు చేసిన వ్యాఖ్యలకు మనోహర్ రెడ్డితో పాటు చందర్ ఏకీభవించారు. టికెట్ ఆశిస్తున్నవారు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వారిని కట్టడి చేయాలని మంత్రి గంగులకు, ప్రభుత్వ చీఫ్ విఫ్ భానుప్రసాద్ రావుకు మధు విజ్క్షప్తి చేశారు. పుట్ట మధు మాటలను ఎమ్మెల్యే దాసరి సమర్ధించడంతో సిట్టింగ్‌లు ఒక వైపు టికెట్ ఆశిస్తున్న వారు మరోవైపు అయినట్లు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నవారు మాత్రం తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తు వారు చేపట్టిన కార్యక్రమాలు కొనసాగించడం పెద్దపల్లిలో బీఆర్ఎస్లో నయావార్ మొదలైనట్లు కనిపిస్తుంది.