- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజన్న సన్నిధిలో సీఎం రేవంత్..
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన, తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం వేములవాడ పర్యటనలో భాగంగా ఉదయం 10:55 గంటలకు గుడి చెరువు కట్టపైన ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లతో కలిసి చేరుకున్న సీఎంకు హెలిప్యాడ్ వద్ద మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే లు మేడిపల్లి సత్యం , కవంపల్లి సత్యనారాయణ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్, డిజిపి జితేందర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం దర్శనంలో భాగంగా ఆలయ ప్రాంగణంలోనికి చేరుకున్న ఆయనకు ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీఎం రేవంత్ రూ. 76కోట్లతో చేపట్టనున్న ధర్మగుండంతో పాటు ఆలయ విస్తరణ పనులకు భూమిపూజ చేసి, అభివృద్ధి ప్రణాళికల డిజైన్ మ్యాప్ లను పరిశీలించి, స్థపతి, ఆర్కిటెక్ట్ లతో చర్చించి పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి నేరుగా ఆలయ ప్రధాన ద్వారమైన తూర్పు రాజగోపురం నుండి 11:55 గంటలకు లోపలికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కోడే మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సీఎం ధ్వజ స్తంభానికి మొక్కి 12 గంటలకు ఆలయ గర్భగుడిలోనికి చేరుకుని ముందుగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని వద్ద పూజలు నిర్వహించి, నందిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తదుపరి ఆలయ అద్దాల మండపం లో ఆలయ అర్చకులు సీఎం కు ఆశీర్వచనం గావించగా దేవాదాయ శాఖ తరఫున కమిషనర్ శ్రీధర్ శాలువాతో సత్కరించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పట్టువస్త్రాలు అందజేశారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారి చిత్రపటం అందించగా, ఆలయ ఈవో వినోద్ రెడ్డి లడ్డు ప్రసాదాలు అందజేశారు. తదనంతరం బయటకు వచ్చిన సీఎం సభ ప్రాంగణానికి బయలుదేరారు.