Ponguleti: ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటీ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |
Ponguleti: ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. బుధవారం వేములవాడ (Vemulawada)లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి మనందరి కష్టం ఫలితంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలు, పాఠశాలలు, వ్యవసాయం, మహిళలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు అన్ని వర్గాలకు మేలు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో హమీ ఇవ్వకపోయినా పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం 40 శాతం మేర విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచిందన్నారు. రాబోయే 4 సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలతో పేదలకు 20 లక్షల ఇండ్లు (Indiramma House Scheme) నిర్మించబోతున్నట్లు చెప్పారు. రాజకీయాలు, కులాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. మిడ్ మానేరు నిర్వాసితులకు రూ.236 కోట్లతో 4,696 ఇండ్ల మంజూరు చేశామన్నారు. ధరణి రికార్డుల నిర్వహణను విదేశీ సంస్థ నుంచి తప్పించి ఎన్ఐసి కు అప్పగించామన్నారు. త్వరలో దేశానికే ఆదర్శంగా నూతన రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed