- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
JC Divakar Reddy: గుర్తుపట్టలేనంతగా మారిన జేసీ దివాకర్ రెడ్డి.. మీడియా ముందుకు షాకింగ్ ఎంట్రీ
దిశ, వెబ్‌డెస్క్: జేసీ దివాకర్ రెడ్డి (JC Divakar Reddy).. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారంటూ ఉండరేమో. తూటాల్లాంటి లాంటి మాటలు, పదునైన విమర్శలకు ఆయన పెట్టింది పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (United Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఓ సెన్సేషన్. 1985లో మొట్టమొదటి సారి ఎమ్మెల్యే (MLA)గా ఎన్నికైన ఆయన ఏకధాటిగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ (MP)గా గెలుపొందారు. 2004 నుంచి 2006లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా జేసీ దివాకర్ రెడ్డి పని చేశారు. అనంతరం 2010లో అప్పటీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) మంత్రివర్గంలో ఆయనకు చోటు లభించలేదు.
2014లో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఎంపీగా గెలుపొందరు. అయితే, నిత్యం యాక్టివ్‌గా ఉండే జేసీ దివాకర్ రెడ్డి (JC Divakar Reddy) కొన్నాళ్ల నుంచి ఎవరికీ కనిపించడం లేదు. వయసు మీద పడటం, అనారోగ్య కారణాల దృష్ట్యా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన ఇవాళ మీడియా ముందుకు షాకింగ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే, జేసీ చూసిన పలువురు ఆయన దివాకర్ రెడ్డేనా అని ఓకింత తడబడ్డారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో ప్రజలంతా ఆర్థికంగా బలపడి సుఖ సంతోషాలతో ఉండాలని ఆంకాంక్షించారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.