- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : విప్ ఆది శ్రీనివాస్..
దిశ, వేములవాడ : శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని, పాడి పంటలతో రైతులు విరాజిల్లాలని రాజన్నను దర్శించుకుని వేడుకున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని విప్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించగా, ఈఓ వినోద్ రెడ్డి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కోడెను కడితే కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన రాజన్న ఆశీస్సులతో ఆలయ అభివృద్ధితో పాటు, పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే రూ.127 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టామన్నారు. పనుల్లో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా త్వరగా పూర్తయి భక్తులకు మెరుగైన వసతులు కలిగేలా చూడాలని స్వామి వారితో పాటు అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.