ప్రజల పక్షాన దిశ వార్తలు.. సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

by Sumithra |
ప్రజల పక్షాన దిశ వార్తలు.. సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
X

దిశ, కరకగూడెం : పత్రికలు ప్రజల పక్షాన వార్తలు రాస్తుందని, ఆ విషయంలో 'దిశ' ముందుటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దిశ నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దిశ పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వార్తలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా దిశ పనిచేస్తుందని, ప్రజా సమస్యల పై వార్తలు రాయడంలో దిశ ముందుటుందన్నారు.

వ్యవస్థలు, ప్రజలు నిర్వహించే కార్యక్రమాలు తిరిగి జన సామాన్యులకు తిరిగి వెళ్ళడానికి ప్రధాన భూమికను పత్రికలు పోషిస్తున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరవేసే విధంగా కృషి చేస్తున్నాయని, పత్రిక, మీడియా లేని సమాజం ఊహించలేమని అన్నారు. భవిష్యత్ లో అదే విధంగా దిశ ప్రజలకు ఉపయోగపడేలా మంచి వార్త కథనాలు రాయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగబండి వెంకటేశ్వర్లు, గాంధర్ల రామనాథం, దుర్గం కన్నయ్య, నాయకురాలు ఎండీ ఆశ్ర ఫునీస, పోలెబోయిన సుజాత, విలేకరులు సాయికిరణ్, సురేష్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story