భర్తతో విడిపోయిన ఏఆర్ రెహమాన్ టీమ్‌మెట్.. హాట్ టాపిక్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్

by Hamsa |
భర్తతో విడిపోయిన ఏఆర్ రెహమాన్ టీమ్‌మెట్.. హాట్ టాపిక్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్
X

దిశ, సినిమా: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్(AR Rahman) తన భార్య సైరా భాను(Saira Bhanu)తో విడిపోయిన సంగతి తెలిసిందే. 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఓ పోస్ట్ షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో వీరిద్దరి విడాకులు గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, మరో సెలబ్రిటీ, ఏఆర్ రెహమాన్ టీమ్‌ మెంబర్ మోహిని(Mohini Dey) భర్తకు విడాకులు ఇచ్చినట్లు ఇన్‌స్టాగ్రార్ ద్వారా ప్రకటించింది. ‘‘ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను.

భారమైన హృదయంతో, మార్క్(Mark) నేను విడిపోయామని ప్రకటిస్తున్నాను. మా ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాము. మేము గొప్ప స్నేహితులుగా ఉంటూనే, జీవితంలో విభిన్న విషయాలను కోరుకుంటున్నాము. పరస్పర ఒప్పందం ద్వారా విడిపోవడమే ఉత్తమ మార్గం అని ఇద్దరం నిర్ణయించుకున్నాము. ఇప్పటికీ MaMoGi మోహిని డే గ్రూపులతో సహా అనేక ప్రాజెక్ట్‌లలో కలిసి పని చేస్తాము. అలా చేస్తున్నందుకు మేము ఎల్లప్పుడూ గర్విస్తున్నాను.

మనం కోరుకునే పెద్ద విషయం ఏమిటంటే.. మీరు మాకు అందించిన మద్దతును మేము అభినందిస్తున్నాము ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దయచేసి మా పట్ల సానుకూలంగా ఉండండి. మా గోప్యతను దృష్టిలో పెట్టుకుని జడ్జ్‌మెంట్ ఇవ్వరని ఆశిస్తున్నా’’ అని రాసుకొచ్చింది. అయితే ఏఆర్ రెహమాన్(AR Rahman) విడిపోతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లో మోహిని పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అందుకే గంటల తేడాతో విడాకులు ప్రకటించారని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story