Patnam Narender Reddy : కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పతనం : పట్నం నరేందర్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
Patnam Narender Reddy : కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పతనం : పట్నం నరేందర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పతనాన్ని కొడంగల్ నుంచి నేనే ప్రారంభిస్తానని మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి(Patnam Narender Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. నరేందర్ రెడ్డి కోర్టు వద్ద తనను కలిసేందుకు వచ్చిన వారితో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు, ఏ కోర్టు వద్ద చేశారన్నది తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ లగచర్ల ఫార్మా బాధిత రైతుల మద్దతుగా వెళితే తనపై రాజకీయ కుట్రతో కేసు పెట్టాదని వ్యాఖ్యానించారు.

ఇంటలిజెన్స్, పోలీస్ వైఫల్యం, సీఎం రేవంత్ వైఫల్యంతో కలెక్టర్, అధికారులపై దాడి జరిగిందన్నారు. దాడిలో వారి వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు కుట్రలో భాగంగా తనపై కేసు పెట్టారన్నారు. న్యాయ స్థానం మీద, చట్టాల మీద గౌరవం ఉందని, నిర్ధోషిగా బయటకు వస్తానన్నారు. కాగా నరేంద రెడ్డి హైకోర్టులో తనపై పెట్టిక కేసును కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్ పై విచారణ ముగిసిపోగా, కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

Advertisement

Next Story