- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Biren Singh: పిల్లలు, మహిళలను చంపడం మానవత్వం కాదు.. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల మణిపూర్ (Manipur)లోని జిరిబామ్ జిల్లా(Jiribalm distric)లో కుకీ మిలిటెంట్లు (Kukee militants) ఆరుగురిని హతమార్చిన ఘటనపై సీఎం బీరేన్ సింగ్ (Biren singh) ఎట్టకేలకు స్పందించారు. మృతి చెందిన వారికి సంతాపం తెలిపిన ఆయన దోషులను శిక్షించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు. మహిళలు, చిన్నారులను హత్య చేయడం మానవత్వానికి విరుద్ధమైన నేరమన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. కుకీ ఉగ్రవాదుల భయంకరమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. నిందితులను పట్టుకుని వారిని చట్టపరంగా శిక్షిస్తామన్నారు. ఇటువంటి పాశవిక చర్యలకు ఏ నాగరిక సమాజంలోనూ చోటు లేదని స్పష్టం చేశారు. మిలిటెంట్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బోరోబెక్రాలోని ఒక సహాకయక శిబిరంలో నివసిస్తున్న ప్రజలపై దాదాపు 40 నుంచి 50 మంది సాయుధులు దాడి చేశారని, జిరిబామ్‌లోని పోలీసు స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. భయాన్ని వ్యాప్తి చేయడమే వారి లక్ష్యమని ఆరోపించారు. అయితే అక్కడ మోహరించిన సీఆర్పీఎఫ్ (CRPF) సిబ్బంది 10 మంది ఉగ్రవాదులను హతమార్చారని దీంతో శిబిరంలో నివసిస్తున్న వందలాది మంది ప్రాణాలు సేఫ్ అయ్యాయన్నారు. సత్వర చర్య తీసుకున్నందుకు సీఆర్‌పీఎఫ్‌కు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మిలిటెంట్ల హత్య తర్వాత కుకీ గ్రూపునకు చెందిన ఉగ్రవాదులు ముగ్గురు పిల్లలు, ముగ్గురు మహిళలను చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఆరురోజుల తర్వాత సీఎం స్పందించారు.