Deputy CM:‘సీఎం చంద్రబాబు పాలనపై విశ్వాసం ఉంది’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
Deputy CM:‘సీఎం చంద్రబాబు పాలనపై విశ్వాసం ఉంది’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) ఎనిమిదవ రోజు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం) జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్(AP Deputy CM Pawan Kalyan) కళ్యాణ్ ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం(AP Government) పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాలనపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చెప్పారు. సమర్ధులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చన్నారు. విజయవాడ వరదల(Vijayawada Floods) సమయంలో అధికార యంత్రాంగాన్ని దగ్గరుండి నడిపిన తీరు అభినందనీయమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు.

Advertisement

Next Story