- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ వృక్షాన్ని పీకడం ఎవరి తరం కాదు : గాదరి కిషోర్ కుమార్
దిశ,తుంగతుర్తి: సీఎం రేవంత్ రెడ్డి ఒక పిట్టల దొర.. అబద్దాలకోరు... పచ్చి మోసకారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మండిపడ్డారు.ఈ ఏడాది కాలంలో ఎక్కడ మీటింగ్ పెట్టిన కేసీఆర్,కేటీఆర్ లను తిట్టడమే లక్ష్యంగా సాగుతున్నాడని మండిపడ్డారు.సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.చరిత్రలో తెలంగాణ జాతిపితగా ప్రజల్లో వాసికెక్కిన కెసిఆర్ మొక్కను పీకేయడం సీఎం రేవంత్ రెడ్డితో సహా ఎవరి తరం కాదని స్పష్టం చేశారు.
కేసీఆర్ అనేది ఒక మహా వృక్షమని,ఆ వృక్షం ఊడను కూడా కదిలించలేరని అన్నారు.తెలంగాణ ప్రజల్లో సీఎం రేవంత్ రెడ్డి తులసి వనంలో కలుపు మొక్క గా,నందన వనంలో గంజాయి మొక్కగా మారాడని మండిపడ్డారు.భద్రతా సిబ్బంది లేకుండా మూసి ప్రక్షాళనతో పాటు ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలకు వెళ్లే ధైర్యం లేదని ఒకవేళ వెళితే ప్రజలు బట్టలు ఊడదీసి కొడతారని అన్నారు.ముఖ్యంగా మూసి ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని,అసలు దీన్ని తెరపైకి తెచ్చిందే బీఆర్ఎస్ అధినేత కెసీఆర్ అని పేర్కొంటూ 16 వేల కోట్లు బడ్జెట్ ఆనాడు కేటాయించినట్లు గుర్తు చేశారు.మూసీ ప్రక్షాళనపై పొంతనలేని మాటలు చెబుతూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం దాన్ని నమ్మే స్థితిలో లేరని అన్నారు.
సీఎంకు ప్రభుత్వాన్ని నడపడం చేతకాదనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని చివరికి రక్షణగా నిలిచే రక్షకబటులే రోడ్డుమీదికి ఎక్కే పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు.రుణమాఫీ,రైతుబంధు లాంటి పథకాలకు దిక్కు లేకుండా పోయిందని అన్నారు.ఓటుకు నోటు కేసులో దోషిగా నిలిచిన రేవంత్ రెడ్డి నేడు నీతి సూత్రాలు వల్లిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.ఏడాది కాలంలోనే ప్రజల రక్తం తాగుతున్న సీఎంను మరో నాలుగేళ్ల పాటు ప్రజలు భరించే స్థితిలో లేరని అన్నారు.తుంగతుర్తి నియోజకవర్గంలో వరి పంట సాగు దారుణంగా పడిపోయిందని అన్నారు.సమావేశంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య,రఘునందన్ రెడ్డి,కల్లెట్లపల్లి ఉప్పలయ్య,నాయకులు గుండగాని రాములు, దొంగరి గోవర్ధన్,దుర్గయ్య,దాసు,తదితరులు పాల్గొన్నారు.