Dasoju Shravan : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో సీఎం మార్పు : దాసోజు శ్రవణ్

by Y. Venkata Narasimha Reddy |
Dasoju Shravan : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో సీఎం మార్పు : దాసోజు శ్రవణ్
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల(Maharashtra election results)తర్వాత తెలంగాణలో సీఎం మార్పు(CM change)తధ్యమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్(Dasoju Shravan)సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అదానీ వంటి వారిని ప్రమోట్ చేస్తున్నాడని, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి కుర్చీ ఉడబెరుకపోతున్నారన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేద ప్రజల ఇండ్లను కూల్చుతూ బుల్డోజర్ పాలన చేస్తున్నాడని..అందుకే రేవంత్ కుర్చీకి ప్రమాదం ఏర్పడిందన్నారు. పదవీ భయంతో ప్రస్టేషన్ తో రేవంత్ రెడ్డి స్టార్ గా, పరేషాన్ రెడ్డిగా మారి కేసీఆర్ పైన అడ్డగోలు విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు. అయితే ఢిల్లీ పెద్దలను మంచిగా చూసుకుంటున్న రేవంత్ పదవికి ప్రస్తుతం డోకా లేకపోవచ్చంటూ వ్యంగ్యాస్త్రాలు వేశారు. కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సాటి రాడన్నారు.

కార్యకర్తల పౌరుషం అంటూ అసలు కాంగ్రెసోళ్లను ప్రక్కన పెట్టి పటేళ్ల కాంగ్రెస్ చేసిండని ఆరోపించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పి మయా మాటలు చెబుతున్నాడన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రూ.2500, తులం బంగారం వంటివి ఇవ్వలేదని విమర్శించాడు. కేసీఆర్ తెచ్చిన కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ ఇవ్వడం లేదన్నారు. సోనియాగాంధీ కాళ్లు కడిగినా తప్పులేదంటున్న రేవంత్ రెడ్డి గతంలో బలిదేవత అన్నందుకు చెంపలేసుకోవాలన్నారు. 80లక్షల ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని, మరి విజయోత్సవాలు ఎందుకని ప్రశ్నించారు.

Advertisement

Next Story