- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వంతెన ఇంతేనా...అదుపు తప్పితే అంతే సంగతి
దిశ, మద్నూర్ : గ్రామాల ప్రగతిలో రహదారుల పాత్ర కీలకం. 20 సంవత్సరాల క్రితం రోడ్డు నిర్మించారు. ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోని దుస్థితి. బిచ్కుంద మండలం మిషన్ కల్లాలి, గుండె కల్లూర్ గ్రామ పంచాయతీల పరిధి కల్వర్టు, వాగుల వద్ద వరద నీరు ప్రభావం వల్ల రోడ్లు కోతకు గురై రోడ్లు కూలిపోయి అధ్వానంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా ముళ్ల కంపలతో మూసుకుపోయి వాహనాలు రాకపోకల సమయంలో ప్రజలు, చోదకులు నానా పాట్లు పడుతున్నారు. వాహనాలు ముణ్నాళ్లకే మరమ్మతుల షెడ్యూలకు వెళ్తున్నాయి. రాత్రి వేళ్ళల్లో గుంతలు కనిపించక పలువురు ఆస్పత్రుల పాలవుతున్నారు.
ముళ్ళ కంపలు రోడ్డుకు ఇరువైపులా మూసుకుపోయి. ముందు నుంచి వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బంది పడుతున్నారు. ఇక వర్షాకాలంలో పరిస్థితి దేవునికి ఎరుక. బిచ్కుంద మండలం మిషన్ కల్లలి గ్రామపంచాయతీ పరిధి వద్ద లోతట్టు కల్వర్టు కావడంతో వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికి రోడ్డు పై నుండి నీరు పొంగుతుంది. గుండెకల్లుర్ గ్రామపంచాయతీ పరిధిలో వాగు వంతెన వర్షపు నీటి ప్రభావంతో రోడ్డు కృంగిపోయి కోతకు గురై కూలిపోయింది. డోంగ్లి మండలం దోతి గ్రామపంచాయతీ పరిధిలో గుంత ఏర్పడి గత కొన్ని ఏండ్లుగా మరమ్మతులకు నోచుకోని దుస్థితి.
ఈ మార్గంలో...
బిచ్కుంద మండలంలోని మిషన్ కల్లాలి, గుండె కల్లూర్, ఖతగావ్ డోంగ్లి మండల కేంద్రంలోని దోతి, మల్లాపూర్ గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండా ప్రజలు బిచ్కుంద మండల కేంద్రానికి వెళ్లడానికి రావడానికి ప్రధాన రహదారిగా ఆశ్రయిస్తారు. రోజుకు వందలాది వాహనదారులు ఈ మార్గంలో బిచ్కుంద మండల కేంద్రానికి రైతులు విద్యార్థులు వ్యాపారవేత్తలు అధికంగా వెళ్తారు. ఏ చిన్న వస్తువు తీసుకుందామన్న బిచ్కుంద మండల కేంద్రానికి వెళ్లక తప్పదు. ఈ మార్గంలో గుంతలు, గోయ్యి, ముళ్ళ కంపలు ఉన్నాయి. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వంతెన నిర్మించాలి : నవనాథ్ విద్యార్థి
-గుండె కల్లూరు వాసి
గుండె కల్లూర్- మిషన్ కల్లలి గ్రామపంచాయతీ పరిధిలో వర్షాకాలంలో నైతే వర్షానికి కల్వర్టు, వాగు వంతెన పై నుండి వరద నీరు పారుతుంది. 20 కిలోమీటర్ల చుట్టూరా తిరిగి వెళ్లాల్సి వస్తుంది. వంతెన వద్ద రోడ్డు కోతకు గురై కూలిపోయింది. ముళ్ళ కంపలు రోడ్డుకు ఇరువైపులా కమ్ముకున్నాయి. బిచ్కుంద మండల కేంద్రానికి రోజు సైకిల్ పై కళాశాల కు వెళ్తాను. ముంగటి నుంచి వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బందులకు గురవుతున్నాను.
వాహనాలు మరమ్మత్తుల పాలవుతున్నాయి : ఆటో డ్రైవర్ షాదుల్
-గుండె కల్లూర్ వాసి
గత 20 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్ రోజు విద్యార్థులకు, రైతుల ధాన్యాన్ని బిచ్కుంద మండల కేంద్రానికి తీసుకెళ్తాను. వాహనాలు గుంతల్లో పడి మరమ్మత్తుల షెడ్డుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు నిర్వహించాలని కోరుతున్నాం.
అధికారుల వివరణ
ఆర్ అండ్ బి డివిజన్ అధికారులకు ఫోన్ చేయగా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్థం. బిచ్కుంద మండల ఆర్ అండ్ బి ఏఈ వివరణ కోరగా విధి నిర్వహణలో లేనని సెలవులో ఉన్నట్లు తెలిపారు.