- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bomb attack:12 మంది పాక్ సైనికులు మృతి.. ఖైబర్ పఖ్తుంఖ్వాలో మరో ఆత్మాహుతి దాడి
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ (pakisthan)లో ఉగ్రవాద ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా (Khyber-Pakhtunkhwa) ప్రావిన్స్‌లో బుధవారం మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో12 మంది పాక్ ఆర్మీకి చెందిన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఆర్మీ మీడియా వింగ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ వాయువ్య సరిహద్దులో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని బన్నూ జిల్లాలోని ఆర్మీ చెక్‌పోస్టు సమీపంలో ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని తీసుకొచ్చి పేల్చేశాడు. దీంతో ఆర్మీ చెక్ పోస్టుకు చెందిన మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతినడంతో పాటు 12 మంది సైనికులు మరణించారు. ఘటన తర్వాత మరికొందరు ఉగ్రవాదులు చెక్ పోస్టుపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో మరో ఏడుగురు జవాన్లు గాయపడ్డారు. అనంతరం భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు టెర్రరిస్టులు కూడా హతమయ్యారు. ఈ దాడికి పాక్ తాలిబన్ నుంచి విడిపోయిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ బాధ్యత వహించింది.
కాగా, ఈ దాడికి ఒకరోజు ముందే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన మరో ఉగ్రదాడిలో పాక్ ఆర్మీకి చెందిన ఎనిమిది మంది సైనికులు మరణించారు. ఈ ఘర్షణలో ఉగ్రవాదులు, సైనికుల మధ్య కొన్ని గంటలపాటు కాల్పులు జరిగాయి. ఇందులో 9 మంది ఉగ్రవాదులు, ఎనిమిది మంది సైనికులు మరణించారు. ఈ దాడికి తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ నెల 9న క్వెట్టాలోని రైల్వే స్టేషన్ లో బాంబు పేలుడు జరగగా 14 మంది సైనికులతో సహా 25 మంది మరణించారు. దీంతో వరుస ఘటనల నేపథ్యంలో పాక్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.