Indians Health: ప్రతి 20 సెకన్లకు ఒక భారతీయుడు ఈ వ్యాధి బారినపడుతున్నాడు.. వీడియో షేర్ చేసిన MS. ధోనీ

by Anjali |
Indians Health: ప్రతి 20 సెకన్లకు ఒక భారతీయుడు ఈ వ్యాధి బారినపడుతున్నాడు.. వీడియో షేర్ చేసిన MS. ధోనీ
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బ్రెయిన్(Brain) అటాక్ అని పిలువబడే స్ట్రోక్(stroke), మెదడు(brain)కు రక్త ప్రసరణ(blood circulation)కు అంతరాయం ఏర్పడినప్పుడు సంభవిస్తుంది. మెదడు సరిగ్గా పనిచేయడానికి ఆక్సిజన్(Oxygen), పోషకాల స్థిరమైన సరఫరా అవసరం. అయినప్పటికీ, రక్త ప్రసరణకు కొంత సమయం పాటు అంతరాయం కలిగితే, ఇది సమస్యలకు దారితీయవచ్చు. రక్తం లేదా ఆక్సిజన్ లేకుండా, మెదడు కణాలు సెకన్లలో చనిపోతాయి’.

ఇకపోతే తాజాగా మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni) బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధి(Brain stroke disease) గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. తాజాగా ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్(Pharmaceutical company Encure Pharmaceuticals) మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni)తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది.

ప్రతి 20 సెకన్లకు ఒక భారతీయుడు ఈ వ్యాధి బారిన పడుతున్నాడని వీడియోలో ధోనీ చెప్పుకొచ్చారు. మరీ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాల్ని ముందే గుర్తిస్తే ఎటువంటి సమస్యుండదు. మరీ దాని లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం..

ధోనీ అవగాహన కార్యక్రమంలో స్ట్రోక్ లక్షణాల్ని వివరించేటప్పుడు ‘BEFAST’ అనే ఒక ఫార్ములాను వాడారు. ఒక్కో లెటర్ ఒక లక్షనంతో ముడిపడి ఉంది. మరీ వాటి మీనింగ్ ఏంటో తెలుసుకుందామా..?

‘B’- బి అంటే బ్యాలెన్స్ క్షీణించడం అని అర్థం. అనుకోకుండానే మీ బాడీలో సమతుల్యత కోల్పోతుంది. నడుస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మైకము కమ్మినట్లు అనిపిస్తుంది. కాగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించండి.

‘E’- ఇ అక్షర అనేది ఐస్2ను సూచిస్తుంది కళ్లు మసకబారినట్లు అనిపించడం, కళ్లలో ప్రతిరోజూ మంటగా అనిపించినా.. అది బ్రెయిన్ స్ట్రోక్ కు కారణమవుతుంది.

‘F’-ఎఫ్ అంటే ఫేస్. ముఖం లాగినట్లు అనిపిస్తే కనుక వెంటనే డాక్టర్ ను అప్రోచ్ అయి.. ప్రాబ్లమ్‌ను వివరించి.. అందుకు తగిన మెడిసిన్ వాడాలి. లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ మరింత అధికమయ్యే చాన్స్ ఉంటుంది.

‘A’- ఎ అనే లెటర్ ఆర్మ్ అనే పదాన్ని సూచిస్తుంది. ఒకసారి మీ రెండు హ్యాండ్స్‌ను పైకి లేపి చూసుకోండి. వెంటనే నీరసంగా అనిపించినా.. కింద పడిపోయినా అది స్ట్రోక్‌కు దారితీస్తుంది.

‘S’- ఎస్ అంటే స్పీకింగ్. మాట్లాడేటప్పుడు నాలుక తడబడటం, మాట్లాడటంలో ఇబ్బందిగా అనిపించినా.. బ్రెయిన్ స్ట్రోక్ కు కారణం అవుతుంది. కాగా వైద్యుడ్ని సంప్రదించడం బెటర్.

‘T’- టీ అంటే టైమ్లీ యాక్షన్. మీరు చర్యకు ప్రతిచర్య మీలో ఆలస్యమైనట్లైతే మీ మైండ్ సరిగ్గా పనిచేయట్లేదని గుర్తించండి. బ్రెయిన్ స్ట్రోక్ అనేది డేంజరస్ వ్యాధి. కాబట్టి మీలో పైన లక్షణాలు ఏం కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed