- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హనుమాన్ శోభా యాత్రలో ఘర్షణ.. ఇరు వర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు
by Shiva |
X
దిశ, గొల్లపల్లి: హనుమాన్ జయంతి సందర్భంగా గొల్లపల్లి మండల పరిధిలోని చిలువకోడూరులో బుధవారం రాత్రి హనుమాన్ మాలధారణ భక్తులు చేపట్టిన హనుమాన్ శోభాయాత్రలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. యాత్ర నిర్వహిస్తున్న హనుమాన్ భక్తులపై కొంతమంది రాళ్లు విసరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా యాత్ర నిర్వహిస్తున్న తమపై కొంతమంది ముస్లిం యువకులు కావాలనే కక్షపూరితంగా రాళ్లు రువ్వారని హనుమాన్ భక్తులు ఆరోపించారు.
గురువారం ఉదయం గ్రామంలో హనుమాన్ భక్తులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడంతో కొద్దిసేపు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ఆర్.ప్రకాష్ గ్రామానికి చేరుకొని రెండు వర్గాల వారికి నచ్చజెప్పారు. ఏ వర్గం వారైనా శాంతియుతంగా మతసామరస్యంతో మెలగాలని సూచించారు.
Advertisement
Next Story